ETV Bharat / sports

'ట్రోఫీ గెలవకపోతే.. ఎన్ని సెంచరీలు చేసినా వృథానే' - టీ20 ప్రపంచకప్​ 2021

జట్టు ట్రోఫీ సాధించకపోతే వ్యక్తిగతంగా ఎన్ని పరుగులు, శతకాలు సాధించినా వాటికి విలువ లేదన్నాడు టీమ్​ఇండియా (Rohit Sharma News) స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ. 2016తో పోలిస్తే బ్యాటర్​గా తాను ఎంతో పరిణతి చెందినట్లు తెలిపాడు.

Rohit Sharma News
రోహిత్ శర్మ
author img

By

Published : Nov 5, 2021, 4:14 PM IST

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) స్కాట్లాండ్​తో మ్యాచ్​కు (India vs Scotland) ముందు కీలక వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ. ట్రోఫీ గెలవకపోతే చేసిన పరుగులకు, సాధించిన సెంచరీలకు ఎలాంటి విలువ ఉండదని అన్నాడు.

"2016తో పోలిస్తే బ్యాటర్​గా ఎంతో పరిణతి చెందాను. జట్టుకు ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం. వ్యక్తుల కన్నా జట్టే ప్రధానం. ఆ సమయానికి వ్యక్తిగతంగా కన్నా జట్టుకు ఏది సరైందో అదే చేయాలి. ఒక షాట్​ ఎంచుకునే ముందు జట్టుకు కావాల్సింది ఇదేనా అని ఆలోచించాలి."

- రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా బ్యాటర్

2019 వన్డే ప్రపంచకప్​లో రోహిత్​ 5 సెంచరీలు (Rohit Sharma World Cup Centuries) సాధించాడు. ఆ టోర్నీ సెమీస్​లో న్యూజిలాండ్ చేతిలో టీమ్​ఇండియా ఓటమిపాలైంది. వ్యక్తిగతంగా ఈ టోర్నీ అంటే తన​కు చాలా ప్రత్యేకమని చెప్పాడు రోహిత్. తన ప్రణాళికలను సరిగ్గా అమలు చేసి పరుగులు రాబట్టడమే అందుకు కారణమన్నాడు.

"ఏదైనా టోర్నీలో మన ప్లాన్​ సఫలమైతే ఎంతో ఆనందం కలుగుతుంది. కానీ, నిజాయితీగా చెప్పాలంటే ట్రోఫీ గెలవకపోతే.. ఎన్ని పరుగులు చేసినా, ఎన్ని సెంచరీలు సాధించినా వాటికి విలువ ఉండదు." అని చెప్పాడు రోహిత్.

ఇదీ చూడండి: 'రోహిత్-రాహుల్​పైనే ఆధారపడితే ఎలా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.