ETV Bharat / sports

T20 World Cup 2021: నెట్స్​లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన హార్దిక్ పాండ్య - టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​(T20 world Cup) సందర్భంగా.. టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya News) బౌలింగ్ ఫామ్​ అంశం సర్వత్రా చర్చనియాంశమైంది. అయితే.. బుధవారం అతడు నెట్స్​లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. మెంటార్ ధోనీ సూచనలు తీసుకున్నాడు.

hardik
హార్దిక్ పాండ్య
author img

By

Published : Oct 28, 2021, 4:55 AM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా పాకిస్థాన్​తో జరిగిన తొలి మ్యాచ్​లో టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya News) కుడిచేయి భుజానికి గాయమైంది. అయితే.. అతడు బౌలింగ్​ చేయడం ఇక కష్టమే అని అందరూ భావించారు. కానీ, బుధవారం నెట్స్​లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్, సోహమ్ దేశామ్ ఆధ్వర్యంలో 15 నిమిషాల పాటు బౌలింగ్ చేశాడు హార్దిక్. అనంతరం.. 20-25 నిమిషాల పాటు ఫిట్​నెస్​ డ్రిల్స్ చేశాడు.

నెట్స్​లో బ్యాటింగ్​ స్కిల్స్​పై కూడా ఫోకస్​ చేశాడు హార్దిక్. ఈ ప్రాక్టీస్​ సెషల్​ భాగంగా టీమ్​ఇండియా మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni Mentor).. పాండ్యకు పలు సలహాలు ఇచ్చాడు.

ప్రపంచకప్​ మ్యాచ్​ల్లో హార్దిక్ కనీసం రెండు ఓవర్లైనా బౌలింగ్ చేస్తే బాగుంటుందని టీమ్ఇండియా సారథి ఇటీవలే పేర్కొన్నాడు. అయితే.. పాకిస్థాన్​తో మ్యాచ్​కు ముందు.. రానున్న మ్యాచ్​ల్లో బౌలింగ్ చేస్తానని హార్దిక్ కూడా తెలిపాడు. కానీ, అనూహ్యంగా పాక్​ మ్యాచ్​లో అతడి భుజానికి స్వల్ప గాయమైంది.

ఇదీ చదవండి:

'హార్దిక్​ గాయంపై ఆందోళన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.