అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత విజయవంతమైన సారథిగా ఖ్యాతి పొందిన అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ (Asghar Afghan News) క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2021) ఆదివారం(అక్టోబర్ 31) నమీబియాతో జరగనున్న మ్యాచ్ అతడికి చివరిది.
ఈ మేరకు ట్వీట్ చేసిన అఫ్గాన్ క్రికెట్ బోర్డు (Afghanistan Cricket News) అస్గర్ సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. అతడి స్థానాన్ని భర్తీ చేయాలంటే యువ అఫ్గాన్ క్రికెటర్లు ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని ప్రశంసించింది.
ధోనీని అధిగమించి..
2009లో అరంగేట్రం చేసిన అస్గర్.. కెరీర్లో 6 టెస్టులు, 114 వన్డేలు, 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ ఏడాది మార్చిలో జింబాబ్వేతో 3-0తో సిరీస్ గెలిచిన అఫ్గాన్ జట్టుకు నాయకుడిగా ఉన్న అస్గర్.. 52 మ్యాచుల్లో 42 విజయాలు సాధించి (Asghar Afghan Captaincy Record) అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ (72 మ్యాచుల్లో 41 విజయాలు) రికార్డును బ్రేక్ చేశాడు.
ఇదీ చూడండి: 'నేను ఇక జాతీయ జట్టుకు ఆడలేనేమో'