ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్ ఫైనల్​కు ముందు కివీస్​కు షాక్ - డెవాన్ కాన్వే టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 final) ఫైనల్ ముంగిట న్యూజిలాండ్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్టు వికెట్ కీపర్, బ్యాటర్ డెవాన్ కాన్వే(devon conway injury) గాయం కారణంగా ఈ టోర్నీతో పాటు టీమ్​ఇండియాతో జరిగే టీ20 సిరీస్(ind vs nz t20 series)​కు దూరమయ్యాడు.

Conway
కాన్వే
author img

By

Published : Nov 12, 2021, 9:07 AM IST

అద్వితీయ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్​లో ఫైనల్లో(t20 world cup 2021 final) ప్రవేశించింది న్యూజిలాండ్. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సమయంలో ఈ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ వికెట్ కీపర్, బ్యాటర్ డెవాన్ కాన్వే(devon conway injury) గాయం కారణంగా మెగాటోర్నీ ఫైనల్​కు దూరమయ్యాడు. అలాగే నవంబర్ 17 నుంచి జరగబోయే టీమ్ఇండియాతో టీ20 సిరీస్(ind vs nz t20 series)​కూ అందుబాటులో ఉండట్లేదు.

చిన్న తప్పిదం..

ఇంగ్లాండ్​తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్(ind vs nz t20)​లో అద్భుత బ్యాటింగ్​తో అదరగొట్టాడు కాన్వే(devon conway injury). 38 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ఈ మ్యాచ్​లో ఔటయ్యాక అసంతృప్తితో పిడికిలితో బ్యాట్​ను బలంగా బాదాడు. ఈ సమయంలోనే ఇతడి చేతివేలుకు గాయమైంది. స్కానింగ్​ చేసుకోగా చిటికిన వేలు విరిగినట్లు నిర్ధరణ అయింది. దీంతో కొంతకాలం పాటు అతడికి విశ్రాంతి అవసరమని సూచించారు వైద్యులు. ఔటయ్యాననే చిన్న అసంతృప్తితో చేసిన తప్పిదం ఇప్పుడు కీలక ఫైనల్​ పోరుతో పాటు టీమ్ఇండియాతో టీ20 సిరీస్​కు అతడు అందుబాటులో లేకుండా చేసింది.

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)లో గాయపడిన రెండో న్యూజిలాండ్ ఆటగాడు కాన్వే(devon conway injury). ఇంతకుముందు ఈ జట్టు ఆల్​రౌండర్ లూకీ పెర్గుసన్(lucky ferguson injury) పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్ సమయంలో గాయపడటం వల్ల టోర్నీకి దూరమయ్యాడు.

ఇవీ చూడండి: ఐపీఎల్‌ ప్రసార హక్కులు రూ.40 వేల కోట్లు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.