ETV Bharat / sports

T20 World Cup: విండీస్​పై ఘనవిజయం- సెమీస్​కు ఆసీస్​! - ఆస్ట్రేలియా

వెస్టిండీస్​పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది కంగారూ జట్టు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్​ అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.

t20 world cup
టీ20 ప్రపంచకప్​
author img

By

Published : Nov 6, 2021, 6:56 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియా.. వెస్టిండీస్​పై ఘనవిజయం సాధించింది. విండీస్​ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఛేదించింది. డేవిడ్​ వార్నర్ (89), మిచెల్ మార్ష్ (53)​ అర్ధ శతకాలు చేశారు. విండీస్ బౌలర్లలో హోసెయిన్, గేల్ తలో​ వికెట్ తీశారు.

తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన విండీస్​.. హేజిల్​వుడ్​ దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (44) రాణించాడు. ఎవిన్ లూయిస్ (29), హెట్​మెయిర్ (27)​ ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో రసెల్ (18) మెరిశాడు. ఆసీస్ బౌలర్లలో హేజిల్​వుడ్​ 4 వికెట్లు, కమిన్స్​, జంపా, స్టార్క్​ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.