ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​లలో భారత్​ చేసిన పొరపాట్లు ఇవే..! - 2016 టీ20 ప్రపంచకప్​లో భారత జట్టు

టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021) తప్పకుండా గెలుస్తామనే ధీమాతో బరిలోకి దిగారు. కానీ, అంచనాలు తారుమారయ్యాయి. టీమ్​ఇండియా బ్యాటర్లు, బౌలర్లను పూర్తి స్థాయిలో విఫలమయ్యేలా చేశాయి ప్రత్యర్థి జట్లు. ఆరంభంలోనే పాకిస్థాన్(IND vs PAK T20), న్యూజిలాండ్(IND vs NZ T20) జట్లు భారత్​పై ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత టోర్నీలో, గత టీ20 ప్రపంచకప్​లలో టీమ్​ఇండియా చేసిన పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం..

india team
టీమ్​ఇండియా
author img

By

Published : Nov 3, 2021, 5:51 PM IST

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) ప్రారంభానికి ముందువరకు అందరి ఫేవరెట్​ జట్టు టీమ్​ఇండియానే. టైటిల్​ గెలిచే సామర్థ్యం ఉన్న జట్టు అంటే.. అందరూ చెప్పిన మాట టీమ్​ఇండియా. కానీ, ఒక్కసారిగా ఈ ఊహాగానాలకు చెక్​ పెట్టింది పాకిస్థాన్(IND vs PAK T20 clash)​. తొలి మ్యాచ్​లోనే భారత్​ను చిత్తుగా ఓడించింది. టీ20 వరల్డ్​కప్​ చరిత్రలో భారత్​పై తొలి విజయం నమోదు చేసింది. టీ20 టోర్నీల్లో ఎప్పుడెలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అనే మాటను నిజం చేసి చూపించింది.

ఈ టోర్నీలోని తమ రెండో మ్యాచ్​లో టీమ్​ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్(IND vs NZ T20 clash). అంతే.. టీ20 వరల్డ్​ కప్​ సెమీస్​ చేరుకునే అవకాశాలను కూడా దాదాపుగా కోల్పోయింది ఇండియా. దీంతో కోహ్లీసేనపై తీవ్ర విమర్శల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. గత కొన్నేళ్లుగా టీ20 ప్రపంచకప్​లో భారత జట్టు చేస్తున్న పొరపాట్లు ఏంటి?

2021 టీ20 ప్రపంచకప్​:

టీమ్​ఇండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తొలి మ్యాచ్​ ఆడింది. ఈ మ్యాచ్​లో పాక్​ బౌలర్ షహీన్​ షా అఫ్రిది(Shaheen Afridi vs India).. టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్​పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మ్యాచ్​ ప్రారంభమైన కొద్ది సేపటికే ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్​కు పంపాడు. అయితే.. సారథి కోహ్లీ, పంత్​ నిలకడగా రాణించడం వల్ల టీమ్​ఇండియాకు 151 పరుగుల గౌరవప్రదమైన స్కోరు లభించింది.

అనంతరం ఛేదనలో ఒక్క వికెట్ కోల్పోకుండా భారత్​పై గెలిచింది పాక్​. అయితే.. ఆరంభంలో భువనేశ్వర్​ కుమార్​, షమిలకు బౌలింగ్​ చేసే అవకాశం ఎక్కువగా ఇచ్చాడు విరాట్. దీంతో పాక్​ బ్యాటర్లు మరింత రెచ్చిపోయారు. కోహ్లీ.. జస్ప్రీత్​ బుమ్రాను ముందే బరిలోకి దింపి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

rohith sharma
రోహిత్ శర్మ

ఓపెనర్​గా ఇషాన్..

న్యూజిలాండ్​తో మ్యాచ్​లో సూర్యకుమార్​ యాదవ్​కు బదులుగా ఇషాన్​ కిషన్​ను జట్టులోకి తీసుకుంది టీమ్​ఇండియా మేనేజ్​మెంట్. అయితే.. అతడిని కేఎల్​ రాహుల్​తో ఓపెనర్​గా(Ishan Kishan Opener) బరిలోకి దింపింది. ఈ నిర్ణయం టీమ్​ఇండియా కొంపముంచింది. ఓపెనర్లు సహా.. తర్వాత బ్యాటింగ్​ బరిలోకి దిగిన రోహిత్ శర్మ కూడా విఫలమయ్యాడు. దీంతో మిడిలార్డర్​పైనా ఒత్తిడి పెరిగింది.

ఈ నిర్ణయం భారత జట్టు చేసిన పెద్ద పొరపాటు అని రోహిత్​- రాహుల్​నే ఓపెనర్లుగా పంపించి ఉంటే బాగుండేదని ముంబయి ఇండియన్స్ జట్టు హెడ్ కోచ్ జయవర్ధనే అభిప్రాయపడ్డాడు.

మేటి జట్టుతో పోరుకు సిద్ధమైనా.. టీమ్​ఇండియా ఈ టోర్నీలో ఘోరంగా విఫలమైంది. అయితే.. వరుసగా బయోబబుల్​లో ఉండటం వల్ల కూడా ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిందని కొందరు సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు.

2009 టీ20 ప్రపంచకప్​:

2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమ్​ఇండియా టీ20 ప్రపంచకప్(Dhoni in t20 world cup 2007)​ గెలిచింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ కూడా ప్రారంభమైంది. ఈ ఐపీఎల్​లో భాగంగా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను చాటారు.

అనంతరం 2009లో కూడా టీమ్​ఇండియా కప్​ గెలుస్తుందని అందరూ భావించారు. ఆల్​రౌండర్ యువరాజ్​ సింగ్ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం రవీంద్ర జడేజాకు ఉందని ధోనీ కూడా భావించాడు. అండర్ 19 వరల్డ్​ కప్​, ఐపీఎల్​లో జడేజా ఆటతీరును చూసి ధోనీ ఈ నిర్ణయానికి వచ్చాడు.

jadeja
జడేజా

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో జడేజాకు అవకాశం ఇచ్చాడు ధోనీ. కానీ, 35 బంతుల్లో 25 పరుగులు చేసి జడేజా నిరాశపరిచాడు. 3 పరుగుల తేడాతో టీమ్​ఇండియా ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

2016 టీ20 ప్రపంచకప్​:

ఈ టోర్నీ ఆరంభంలో న్యూజిలాండ్​తో ఓటమి అనంతరం టీమ్​ఇండియా నిలకడగా రాణించి వరుస విజయాలతో దూసుకెళ్లింది. అయితే.. వెస్టిండీస్​తో(IND vs WI t20) జరిగిన సెమీస్​ మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ సూపర్​ ఇన్నింగ్స్​తో రాణించాడు. భారత జట్టు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్​ ముందుంచుంది. కానీ, నో బాల్స్​ కారణంగా టీమ్​ఇండియా ఓటమిపాలైంది.

విధ్వంసకర బ్యాట్స్​మన్ క్రిస్​ గేల్​ను మొదటి ఓవర్లోనే పెవిలియన్ పంపాడు బుమ్రా. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 18 పరుగుల వద్ద సిమన్స్​ ఔట్ చేశాడు. కానీ, అతడు నో బాల్ వేసినట్లు రిప్లేలో స్పష్టమైంది. అనంతరం హార్దిక్​ పాండ్య కూడా నో బాల్​ వేసి సిమన్స్​కు మరో లైఫ్​ ఇచ్చాడు. దీంతో సిమన్స్​ కీలక ఇన్నింగ్స్​ ఆడి విండీస్​ను గెలిపించాడు.

రహానే ఎంపిక కూడా పొరపాటే!

విండీస్​తో సెమీస్​ మ్యాచ్​లో భారత్​ అజింక్య రహానేను ఎంపిక చేసింది. ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ గాయం వల్ల టోర్నీ మధ్యలోనే వైదొలిగిన కారణంగా రహానేకు అవకాశం లభించింది. ఈ మ్యాచ్​లో రహానే 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు.

rahane
అజింక్య రహానే

రహానే మరిన్ని పరుగులు చేసినా.. భారత జట్టు రహానేకు బదులుగా మరో మేటి బౌలర్​తో బరిలోకి దిగి ఉన్నా ఫలితం మరోలా ఉండేది.

ఇదీ చదవండి:

National Sports Award: నీరజ్, మిథాలీ, ఛెత్రికి 'ఖేల్​రత్న'

IND VS AFG T20: ఈ రికార్డులపై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.