ETV Bharat / sports

యూత్​ బాక్సింగ్​​: ప్రి- క్వార్టర్స్​లో అంకిత్, మనీష్ - యూత్​ బాక్సింగ్

పోలండ్​ కీస్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ యూత్​ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత బాక్సర్లు ముందంజ వేశారు. 64 కేజీల విభాగంలో అంకిత్ నర్వాల్​, 75 కేజీల విభాగంలో మనీష్​ ప్రి-క్వార్టర్స్​కు దూసుకెళ్లారు.

Youth Boxing world championship, Ankit, Manish enter pre-quarters,
ప్రపంచ యూత్​ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​, అంకిత్​ నర్వాల్, మనీష్​
author img

By

Published : Apr 17, 2021, 11:39 AM IST

పోలండ్ కీస్​ వేదికగా జరుగుతున్న యూత్​ వరల్డ్​ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​ పోటీల్లో భారత బాక్సర్లు ఆకట్టుకున్నారు. ఆసియా వెండి పతక విజేత అంకిత్​ నర్వాల్​(64 కేజీ), మనీష్​(75 కేజీ) ప్రి-క్వార్టర్ ఫైనల్స్​కు అర్హత సాధించారు.

ఇదీ చదవండి: బోణీ కోసం హైదరాబాద్.. ఆత్మవిశ్వాసంతో ముంబయి

ఉజ్బెకిస్థాన్ బాక్సర్​ అఖ్మదోవ్​పై 5-0 తేడాతో విజయం సాధించాడు అంకిత్​. తన తదుపరి రౌండ్​లో పోలండ్​ బాక్సర్​ ఒలివీర్​తో​ తలపడనున్నాడు. మరో బాక్సర్​ మనీష్​.. ఇజ్రాయెల్​ బాక్సర్​ డానియల్​​పై 4-1తో గెలుపొందాడు. తన తర్వాతి మ్యాచ్​లో జోర్డాన్​కు చెందిన అబ్దల్లా అలారగ్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ఇక 91+ కేజీల విభాగంలో భారత బాక్సర్​ జుగ్నూ పరాజయం చెందాడు. హంగేరీ బాక్సర్​ లీవెంట్​ కిస్​పై ఓడిపోయాడు.

ఇదీ చదవండి: నట్టూకు బీసీసీఐ కాంట్రాక్ట్​ ఎందుకు దక్కలేదంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.