ఒలింపిక్స్ పతక విజేత మీరాబాయి చాను.. తన విజయానికి ఎంతగానో సహకరించిన ట్రక్కు డ్రైవర్లను సన్మానించింది. వారిపై ప్రశంసల వర్షం కురిపించింది మణిపుర్‌కు చెందిన చాను. తన గ్రామం నుంచి రోజూ 30 కిలోమీటర్లు ప్రయాణించి ఇంఫాల్‌లోని శిక్షణా కేంద్రానికి వెళ్లేది. దారిలో ఆమెకు ఎంతోమంది ట్రక్కు డ్రైవర్లు లిఫ్ట్ ఇచ్చి.. ఉచితంగా ఇంఫాల్ వరకు తీసుకెళ్లేవారు. దానికి కృతజ్ఞతగా 150 మంది ట్రక్కు డ్రైవర్లను ఇంటికి పిలిచి.. భోజనం పెట్టి, ప్రతి ఒక్కరికి ఓ షర్ట్, మణిపురి స్కార్ఫ్ అందించింది చాను. ఇప్పుడు.. మీరాబాయిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 49 కేజీల విభాగంలో.. వెయిట్ లిఫ్టల్ మీరాబాయి చాను రజతం గెల్చుకుంది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత తొలి వెయిట్ లిఫ్టర్‌గా ఘనత సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.
నెటిజన్ల ప్రశంసలు..
'మీరాబాయి.. ట్రక్కు డ్రైవర్లకు కృతజ్ఞతను చూపింది. కష్టకాలంలో చానుకు.. ఆ ట్రక్కు డ్రైవర్లు సహకారం అందించారని' ఐఏఎస్ అధికారి సోన్మోనీ బొరా తెలిపారు.
-
Extraordinary gestures by @mirabai_chanu #MirabaiChanu as she conveys her gratitude to these wonderful #TruckDrivers!
— Sonmoni Borah IAS (@sonmonib5) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
In her difficult days, these sand carrying truck drivers used to give free transportation to Mira so that she could have training at 25 km away #spirts facility. pic.twitter.com/TRtASr8Pqx
">Extraordinary gestures by @mirabai_chanu #MirabaiChanu as she conveys her gratitude to these wonderful #TruckDrivers!
— Sonmoni Borah IAS (@sonmonib5) August 6, 2021
In her difficult days, these sand carrying truck drivers used to give free transportation to Mira so that she could have training at 25 km away #spirts facility. pic.twitter.com/TRtASr8PqxExtraordinary gestures by @mirabai_chanu #MirabaiChanu as she conveys her gratitude to these wonderful #TruckDrivers!
— Sonmoni Borah IAS (@sonmonib5) August 6, 2021
In her difficult days, these sand carrying truck drivers used to give free transportation to Mira so that she could have training at 25 km away #spirts facility. pic.twitter.com/TRtASr8Pqx
'ప్రజలు స్ఫూర్తి పొందేందుకు మీరాబాయి చాను ఓ గొప్ప ఉదాహరణ' అని మరో నెటిజన్ ప్రశంసించారు.
చేసిన సహాయాన్ని మరిచిపోవద్దు. చాను నిజమైన ఛాంపియన్ అని మరొకరు ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి:
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం- వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం