ETV Bharat / sports

'ఆ మినహాయింపులు కోరామని నిరూపిస్తే ఆటకు గుడ్​బై చెప్తాం' - ఛాంపియన్‌షిప్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌పై రెజ్లర్లు

Asian Games 2023 : ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో ఆరుగురు రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ప్రముఖ రెజ్లర్​ యోగేశ్వర్​ దత్​ వ్యాఖ్యలను ఖండించారు ప్రస్తుతం నిరసన తెలుపుతున్న స్టార్​ రెజ్లర్లు. మేము స్వతహాగా ట్రయల్స్​ నుంచి మినహాయింపు కల్పించమని ఎవరినీ(ఐఓఏ)ను కోరలేదు. ఒకవేళ అలా డిమాండ్​ చేశామని నిరూపిస్తే పూర్తిగా రెజ్లింగ్​ ఆట నుంచి తప్పుకుంటాం అంటూ భారత స్టార్​ రెజ్లర్లు తేల్చిచెప్పారు.

We did not ask for exemption from trials if it proved will quit from wrestling wrestlers on yogeswar dutt
'అలా కోరామని నిరూపిస్తే ఆటకు గుడ్​బై చెప్తాం'.. : కుస్తీ వీరులు
author img

By

Published : Jun 25, 2023, 11:20 AM IST

Updated : Jun 25, 2023, 11:57 AM IST

Asian Wrestling Championship 2023 : ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో భాగంగా ఆరుగురు రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ప్రముఖ రెజ్లర్​ యోగేశ్వర్‌ దత్‌ వ్యాఖ్యలపై స్పందించారు భారత స్టార్​ రెజ్లర్లు. తమకు మినహాయింపు కల్పించమని తాము ఇండియన్​ ఒలంపిక్​ అసోసియేషన్​ (ఐఓఏ)ను కోరలేదని.. అలా మేము చేసినట్లు నిరూపిస్తే రెజ్లింగ్​ ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటామని స్పష్టం చేశారు.

'మీ గళం విప్పండి..' : యోగేశ్వర్​ దత్​
సెలెక్షన్‌ ట్రయల్స్‌ నుంచి కొందరు స్టార్​ రెజ్లర్లు బజ్​రంగ్​ పునియా, వినేశ్​ ఫోగాట్​, సాక్షి మాలిక్​, సంగీత్​ ఫొగాట్​, సత్యవర్త్​ కడియన్​, జితేందర్​ కిన్హాలు సెలక్షన్స్​ విజేతలతో పోటీపడి గెలిస్తే ఇక అలానే జట్టులో చోటు సంపాదించుకోవచ్చు అనే ఐఓఏ ఇటీవలే ప్రకటించింది. అయితే రెజ్లర్లు ఆందోళన తెలుపుతున్నది ఇందుకోసమేనా అంటూ ఐఓఏ అడ్‌హక్‌ కమిటీ ప్యానెల్ సభ్యుల​ను యోగేశ్వర్‌ దత్‌ ప్రశ్నిస్తూ ఘాటైన వ్యాఖ్యాలు చేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా తమ గళం విప్పాలని కోచ్​లు, తోటి జూనియర్​ రెజ్లర్లతో పాటు వారి తల్లిదండ్రులనూ కోరాడు దత్​.

'కాస్త గడువు కోరాం'..
మరోవైపు ఆసియా క్రీడల నుంచి మినహాయింపు పొందిన రెజ్లర్​ సాక్షి మాలిక్​ 'తాము సెలక్షన్స్​ ట్రయల్స్​ నుంచి మినహాయింపును కోరలేదని.. కేవలం ఆటకు సన్నద్ధం కావడానికి మాత్రమే సమయం అడిగినట్లుగా' వివరించారు. మేము ఎవరి హక్కులకు భంగం కలిగించలేదు. ఆరు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నందునే ప్రాక్టీస్​ కోసం కాస్త గడువు​ కావాలని సమాఖ్య పెద్దలను అడిగినట్లుగా సాక్షి తెలిపారు. దయచేసి దీనిని తప్పుగా ప్రచారం చేయవద్దని ఆమే కోరారు.

మాపై విషం చిమ్మొద్దు..
Bajrang Punia Wrestler Protest : " ఈ సెలక్షన్స్​ ట్రయల్స్​కు సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మీరు నేరుగా క్రీడల శాఖ మంత్రిని కలిసి మాట్లాడండి. వారు ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారనేది మీకే వివరంగా తెలుస్తుంది. కానీ, ఇలా సోషల్​ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ దయచేసి మాపై విషం చిమ్మొద్దు" అంటూ బజ్​రంగ్​ పునియా అన్నాడు. తాము మినహాయింపు కోరినట్లు నిరూపిస్తే పూర్తిగా కుస్తీ ఆట నుంచే తప్పుకుంటామని బజ్​రంగ్ స్పష్టం చేశాడు.

Last Updated : Jun 25, 2023, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.