డోప్ పరీక్షలో దొరికిపోయి టోక్యో ఒలింపిక్స్‌కు దూరమయ్యే ప్రమాదంలో పడ్డ భారత రెజ్లర్ సుమీత్ మలిక్ (125కేజీ) ఆర్థికంగా కూడా నష్టపోనున్నాడు. అతడు బల్గేరియాలోని సోఫియాలో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షలో విఫలమైనందున భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ).. అంతర్జాతీయ సమాఖ్యకు రూ.16 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
డబ్ల్యూఎఫ్‌ఐ తన విధానం ప్రకారం డోపీగా తేలిన రెజ్లర్ నుంచి ఆ మొత్తం జరిమానాను వసూలు చేస్తుంది. అంతే కాదు.. ఒలింపిక్స్‌కు సన్నద్ధం కోసం గత నెలలో హరియాణా క్రీడల విభాగం తనకు చెల్లించిన రూ.5 లక్షలను కూడా సుమీత్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: OLYMPICS: డోప్ పరీక్షలో విఫలమైన భారత రెజ్లర్