ETV Bharat / sports

మూడు నెలలు వేచి చూద్దాం.. రాష్ట్రాలకు రిజిజు సూచన

అన్ని రాష్ట్రాలు మరో రెండు, మూడు నెలల తర్వాతే క్రీడా కార్యక్రమాలు ప్రారంభించే అంశంపై ఆలోచించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు కోరారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సూచనలు చేశారు రిజిజు.

Would urge states to start some kind of sporting activities after 2-3 months: Rijiju
క్రీడల పునఃప్రారంభంపై రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు
author img

By

Published : Jul 16, 2020, 5:32 AM IST

భారత్​లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడా కార్యక్రమాలు పునఃప్రారంభించే అంశంపై రాష్ట్రాలు తొందర పడొద్దని బుధవారం క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు కోరారు. దేశవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే అవకాశాలపై సమీక్షించిన రిజిజు.. మరో రెండు, మూడు నెలల వరకు వీటి గురించి ఆలోచించకుండా ఉండటమే మంచిదని పేర్కొన్నారు.

"క్రీడా కార్యకలాపాలు, ఆటగాళ్లకు శిక్షణను ప్రారంభించే విషయంపై రాష్ట్రాలకు స్వతంత్ర నిర్ణయం ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి మరో 3 నెలల తర్వాతే వీటి నిర్వహణపై దృష్టి సారించాలని నేను కోరుతున్నా."

-కిరణ్​ రిజిజు, క్రీడా శాఖ మంత్రి

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన క్రీడా మంత్రులతో రెండు రోజుల వర్చువల్​ సమావేశం అనంతరం.. ఈ వ్యాఖ్యలు చేశారు రిజిజు. పరిస్థితులన్నీ మెరుగు పడ్డాక.. మొదట నాన్​ కాంట్రాక్ట్ క్రీడలను తిరిగి ప్రారంభించాలని ఉద్ఘాటించారు.

కరోనాపై పోరుకు వాలంటీర్లు..

కరోనాకు వ్యతిరేకంగా భారత్​ చేస్తోన్న పోరాటంలో ప్రభుత్వాలకు సాయంగా కోటి వాలంటీర్లను సమీకరించనున్నట్లు రిజుజు తెలిపారు. ఇందుకోసం నెహ్రూ యువ కేంద్ర సంగధన్​(ఎన్​వైకేఎస్) నేషనల్​ సర్వీస్​ స్కీమ్​(ఎన్​ఎస్​ఎస్​) వంటి స్వచ్ఛంద సేవకులను నిమగ్నం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'క్రీడల పునఃప్రారంభానికి ప్లాన్​ సిద్ధం చేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.