ETV Bharat / sports

ప్రపంచ యూత్​ చెస్​లో​ భారత్​కు స్వర్ణం - latest chess news

ప్రపంచ యూత్‌ చెస్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. తమిళనాడుకు చెందిన ప్రజ్ఞానంద్​ అండర్‌-18 ఓపెన్‌ విభాగంలో స్వర్ణం సాధించాడు. అండర్‌-14 ఓపెన్‌ విభాగంలో తెలుగుతేజం శ్రీశ్వాన్‌ కాంస్యం కైవసం చేసుకున్నాడు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలు కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి.

ప్రపంచ యూత్​ చెస్​లో​ శ్రీశ్వాన్​, ప్రజ్ఞానంద్​ అదరహో
author img

By

Published : Oct 13, 2019, 8:00 AM IST

ముంబయి వేదికగా జరిగిన ప్రపంచ యూత్‌ చెస్‌లో భారత యువక్రీడాకారులు సత్తా చాటారు. శనివారం ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఓ స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలు గెలిచింది.

ప్రజ్ఞానందకు స్వర్ణం...

ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్​ 14 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద్​ టైటిల్​ గెలిచి ఔరా అనిపించాడు. తమిళనాడుకు చెందిన ఈ క్రీడాకారుడు అండర్‌-18 ఓపెన్‌ విభాగంలో... స్వర్ణాన్ని కైవసం చేసుకొని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. శనివారం చివరిదైన 11వ రౌండ్లో వాలెంటిన్‌ బకెల్స్‌ (జర్మనీ)తో గేమ్‌ను డ్రా చేసుకున్న అతను 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

World Youth Chess Championship 2019: sreeshwan Maralakshikari won bronze,14-year-old Grandmaster Praggnanandhaa wins U-18 Open title
భారత పతాకంతో నిల్చున్న స్వర్ణ విజేత ప్రజ్ఞానంద్

మురిపించిన తెలుగుతేజం...

యూత్​ చెస్​లో కాంస్య పతకంతో రాణించాడు తెలంగాణ కుర్రాడు శ్రీశ్వాన్‌. శనివారం జిరిగిన టోర్నీలో అండర్‌-14 ఓపెన్‌ విభాగంలో పాల్గొన్న ఈ యువతేజం...ప్రత్యర్థి అభినందన్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 11 రౌండ్ల నుంచి ఎనిమిది పాయింట్లు సాధించాడు.

కాంస్యం గెల్చిన తెలంగాణ కుర్రాడు శ్రీశ్వాన్​
  • 13 ఏళ్లకే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా నిలిచి తెలంగాణ నుంచి అతి పిన్న వయసులో ఆ ఘనత సాధించిన క్రీడాకారుడిగా ఇదివరకే శ్రీశ్వాన్‌ రికార్డు నమోదు చేశాడు.
  • గత డిసెంబర్‌లో స్పెయిన్‌లో జరిగిన సన్‌వే సిట్జెస్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో మాజీ ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌, ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఇవాంచుక్‌పై విజయం సాధించి శ్రీశ్వాన్‌ వెలుగులోకి వచ్చాడు. ఆ గేమ్‌లో 26 ఎత్తుల్లోనే విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఆసియా యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-14 వ్యక్తిగత విభాగంలో స్వర్ణంతో సత్తాచాటాడు. బాచుపల్లిలోని కెన్నడీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న శ్రీశ్వాన్‌ ప్రపంచ ఛాంపియన్‌ కావడమే తన లక్ష్యమని చెప్పాడు.

అండర్‌-14 ఓపెన్‌ విభాగంలో శ్రీహరి రజతం నెగ్గాడు. అండర్‌-14 బాలికల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్‌, రక్షిత రవి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అండర్‌-16 ఓపెన్‌లో అరోన్యాక్‌ ఘోష్‌ కాంస్యం సొంతం చేసుకున్నాడు. అండర్‌-18 బాలికల విభాగంలో వంతిక అగర్వాల్‌ వెండి పతకం గెలుచుకుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఓ స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలు ఖాతాలో వేసుకుంది.

ఇదీ చదవండి...

New Delhi, Oct 13 (ANI): Men and women are different on various dimensions including benefiting from low-calorie diets, proves a study. In the study of more than 2,000 overweight individuals with pre-diabetes who followed a low-calorie diet for eight weeks, men lost significantly more bodyweight than women, and they had larger reductions in a metabolic syndrome score, a diabetes indicator, fat mass, and heart rate. Women had larger reductions in HDL-cholesterol, hip circumference, lean body mass (or fat-free mass), and pulse pressure than men. The findings have been published in the journal Diabetes, Obesity and Metabolism.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.