ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​: ప్రపంచకప్​-2020 రద్దు - స్పోర్ట్స్​ న్యూస్​

దుబాయ్​ ప్రపంచకప్​ 2020ను రద్దు చేస్తున్నట్లు అరబ్​ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 265 కోట్ల రూపాయల విలువ కలిగిన 9 హార్స్​ రేసులును మార్చి 28 నుంచి నిర్వహించాలని ముందుగా భావించినా.. కరోనా వ్యాప్తి కారణంగా టోర్నీ రద్దు చేశారు. ఈ ఏడాది జరగాల్సిన 25వ వార్షికోత్సవ వేడుకనూ నిర్వాహకులు వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

World Cup 2020 called off due to COVID-19 pandemic
కరోనా ఎఫెక్ట్​: ప్రపంచకప్​ 2020 రద్దు
author img

By

Published : Mar 23, 2020, 11:26 AM IST

కరోనా వైరస్​ కారణంగా దుబాయ్​లో జరగనున్న ప్రపంచకప్​ మీటింగ్​ రద్దయింది. శనివారం నుంచి జరగాల్సిన పోటీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు అరబ్​ ప్రభుత్వం నిర్ణయించింది. 1996లో ప్రారంభమైన ఈ టోర్నీ.. ఈ ఏడాదితో 25వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. అయితే ఈ వార్షికోత్సవ వేడుకను వచ్చే సంవత్సరానికి వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.

"ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్న క్రమంలో అరబ్​ ప్రభుత్వం దానికి సంబంధించిన నియంత్రణ కార్యక్రమాలను చేపట్టనుంది. అందులో భాగంగా మార్చి 28 నుంచి మేదాన్​ రేస్​కోర్స్​ వేదికగా జరగాల్సిన దుబాయ్​ ప్రపంచకప్​ 2020ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది."

- సయీద్​ అల్​ టేయర్​, మేదాన్​ గ్రూప్​ సీఈఓ

World Cup 2020 called off due to COVID-19 pandemic
కరోనా ఎఫెక్ట్​: ప్రపంచకప్​ 2020 రద్దు

ఈ టోర్నీ రద్దు చేయటంపై గోడోల్ఫిన్​కు చెందిన మాజీ ప్రపంచకప్​ విజేత సయీద్​ బిన్​ సురూర్​ అసంతృప్తి వ్యక్తం చేసినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పనిసరి అని అన్నాడు. సయీద్​.. ఇప్పటివరకు 9 సార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు.

దుబాయి ప్రపంచకప్​-2020ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని ముందుగా నిర్ణయించినా.. తాజా పరిణామాలతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ప్రపంచంలో రెండో ధనిక హార్స్​రేస్​గా గుర్తింపు పొందింది. ఇందులో దాదాపుగా 265 కోట్ల రూపాయల విలువ కలిగిన తొమ్మిది రేసులు జరగనున్నాయి.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్​ రద్దు చేయలేం: థామస్​ బాచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.