ప్రపంచ స్థాయిలో మన అథ్లెట్లు మరోసారి సత్తా చాటారు. అండర్-20 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ మిక్స్‌డ్ 4×400 రిలే పరుగు పోటీలో భారత్ కాంస్యం సాధించింది. కెన్యాలోని నైరోబిలో జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో.. భరత్, ప్రియ మోహన్, సమ్మీ, కపిల్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 20.70 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానం సాధించింది. నైజీరియా బృందం 3:19.70 టైమింగ్‌తో స్వర్ణం సాధించగా.. పోలెండ్ జట్టు 3:19.80 టైమింగ్‌తో రజతం గెలుచుకుంది. హీట్స్‌లో 3:23.36 టైమింగ్‌తో భారత బృందం ఈవెంట్లో రెండో ఉత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో సీజన్ బెస్ట్ టైమింగ్‌తో కాంస్యం సాధించింది.
ఛాంపియన్‌షిప్ తొలి రోజే భారత్‌కు ఇలా పతకం దక్కడం మిగతా అథ్లెట్లకు ఉత్సాహాన్నిచ్చేదే. రిలే జట్టులోని ప్రియ.. మహిళల 400మీ. వ్యక్తిగత విభాగంలో 53.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఫైనల్‌కు అర్హత సాధించింది. పురుషుల షాట్‌పుట్‌లో అమన్‌దీప్ 17.92 మీటర్ల దూరం గుండును విసిరి ఫైనల్లో అడుగు పెట్టాడు. జావెలిన్ త్రోలో కున్వర్ అజయ్, జై కుమార్ కూడా తుది పోరుకు అర్హత సాధించారు.
ఐదుకు చేరిన పతకాల సంఖ్య..
ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్‌లో భారత్‌కిది 5వ పతకం. సీమా (2002లో కాంస్యం, డిస్కస్ త్రో), నవ్‌జీత్ (2014లో కాంస్యం, డిస్కస్ త్రో), నీరజ్ (2016లో స్వర్ణం, జావెలిన్ త్రో), హిమ (2018లో స్వర్ణం; 400 మీ. పరుగు) గతంలో పతకాలు సాధించారు.
ఇవీ చదవండి: