ETV Bharat / sports

అప్పుడు బస్కీలు చేస్తూ.. ఇప్పుడు బస్తాలు మోస్తూ!

author img

By

Published : Jul 6, 2020, 8:49 AM IST

కరోనాతో కారణంగా విధించిన లాక్​డౌన్​ క్రీడారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడా కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల.. ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే కామన్​వెల్త్​లో సత్తా చాటిన.. వెయిట్​ లిఫ్టింగ్​ ఛాంపియన్ మాత్రం​​ పొలంలో రైతుగా కనిపించాడు. ఇంతకీ అతనెవరో.. ఈ లాక్​డౌన్​లో తన అనుభవాలేంటో తెలుసుందాం.

Weightlifting champion Venkata Rahul appears as a farmer on the farm.
వెంకట రాహుల్

పొద్దున్నే ట్రాక్టర్‌ నడుపుకుంటూ పొలానికి వెళ్లాడు. వరి బస్తాలు మోశాడు. తిరిగి సాయంత్రానికి ఇల్లు చేరుకున్నాడు.. ఇందులో ప్రత్యేకత ఏముంది? ఏ వ్యవసాయదారుడైనా చేసే సాధారణ పనులేగా అనుకుంటున్నారా? కానీ ఈ పనులు చేసింది ఓ ఛాంపియన్‌ అయితే! కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన విజేత అయితే.. ! కచ్చితంగా అది విశేషమే. ఈ కుర్రాడెవరో కాదు.. యువ వెయిట్‌ లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌. లాక్‌డౌన్‌ ఈ లిఫ్టర్‌ని తాత్కాలిక రైతుని చేసింది. తండ్రిగా సాయంగా పొలం పనులు చేసిన ఈ గుంటూరు కుర్రాడు లాక్‌డౌన్‌ అనుభవాలపై అనేక విశేషాలు పంచుకున్నాడు.

కరోనా వైరస్‌ ఇంతలా విస్తరిస్తుందని, దాని వల్ల లాక్‌డౌన్‌ విధిస్తారని అసలు ఊహించలేదు. ఆట నుంచి ఇంత కాలం పాటు దూరంగా ఉండడం ఇదే తొలిసారి. వెయిట్‌లిఫ్టర్లకు ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. శరీర బరువును ఎల్లప్పుడూ ఒకేలా ఉంచుకోవాల్సి ఉంటుంది. పొద్దున లేవడం నుంచి బరువులు ఎత్తుతూ.. కసరత్తులు చేస్తూ ఉండేవాణ్ని. కానీ ఈ విరామం అనుకోని దెబ్బ కొట్టింది. అయినప్పటికీ ఇంట్లో ఉంటూనే శారీరక శిక్షణ మీద ప్రత్యేక దృష్టి పెట్టా. ఇంట్లో వెయిట్‌లిఫ్టింగ్‌ కిట్‌ ఉండడం కలిసొచ్చింది. దాంతో సాధన చేశా. రోజుకు అయిదారు గంటలు కష్టపడుతున్నా. మా పొలంలో పరుగులు తీశా. సరైన ఆహార నియమాలు పాటిస్తూ బరువును నియంత్రణలోనే ఉంచుకుంటున్నా. లాక్‌డౌన్‌ వల్ల ఏడాది పాటు వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తోంది. టోర్నీలు లేవు. సాధారణ పరిస్థితులు ఏర్పడి తిరిగి పోటీలు జరగాలంటే మరో ఆరు నెలలు పట్టొచ్చు. నవంబర్‌లో జరగాల్సిన జాతీయ ఛాంపియన్‌షిప్‌ కోసం సన్నద్ధమవుదామనుకున్నా. కానీ వైరస్‌ అడ్డుపడింది.

ఆ గాయమే కారణం.

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయకపోవడానికి మోకాలి గాయమే కారణమని వెంకట్​ తెలిపాడు. "నొప్పితోనే ఆ క్రీడల్లో పాల్గొని పసిడి గెలిచా. ఆ తర్వాత గాయం తీవ్రంగా మారింది. దానికి తోడు వెన్నెముక గాయం కూడా బాధించింది. తొమ్మిది నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కానీ మూడు నెలల్లోనే తిరిగి వెయిట్‌లిఫ్టింగ్‌ చేశా. అందుకే అనుకున్న స్థాయి ఫలితాలు రాలేదు. ఈ లాక్‌డౌన్‌ వల్ల తిరిగి పూర్తిగా కోలుకున్నా. మునుపటి జోరు అందుకుంటాననే నమ్మకంతో ఉన్నా. తిరిగి ఆటలు మొదలయ్యాక కుదురుకునేందుకు సమయం పట్టేలా ఉంది. కానీ ఇన్నేళ్లుగా ఆటతోనే సాగుతున్నా కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. టోర్నీల షెడ్యూల్‌ వస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధమవుదామని అనుకుంటున్నా. దేశంలో రోజురోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇప్పట్లో ఆ అవకాశం లేదనిపిస్తోంది.

ఆయన కోసమే ఏదైనా..

నాతో పాటు తమ్ముడు వరుణ్‌ను కూడా ఛాంపియన్లుగా చూడాలన్నది నాన్న కల. మా కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. సొంత ఇల్లు, పొలం కూడా అమ్ముకున్నారు. అలాంటి నాన్నను ఆనందంగా చూసుకోవడం మా కర్తవ్యం. అందుకే గ్రామంలో కొత్త ఇల్లు కట్టిస్తున్నాం. చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండడం, ఆ తర్వాత టోర్నీలంటూ బయట తిరగడంతో ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా నేను, తమ్ముడు, చెల్లి కలిసి ఇంట్లో ఉండడంతో నాన్న చాలా ఆనందంగా ఉన్నారు.

ట్రాక్టర్‌ నడిపా

మా నాన్న వ్యవసాయం చేస్తుంటారు. ఈ విరామంలో ఆయనకు సాయం చేశా. పొలం పనులకు వెళ్లా. అవసరాల కోసం ట్రాక్టర్‌ నడిపా. వరి బస్తాలు మోశా. ఇంట్లో కూడా అన్ని పనులు చేశా. వంట చేయడం నేర్చుకున్నా. బిర్యానీ కూడా వండేశా. సాయంత్రాలు వాలీబాల్‌ ఆడుతూ గడిపా. ఇంట్లో అందరం క్యారమ్స్‌ ఆడాం. నాకు డ్రైవింగ్‌ అంటే ఇష్టం. వీలున్నపుడు నా జీపు నడిపిస్తూ సరదాగా గడిపా. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ నా ఉద్యోగానికి (రైల్వేలో సీనియర్‌ టీటీఈ) సంబంధించి శిక్షణ పూర్తి చేస్తున్నా.

ఇదీ చూడండి:'ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం దేశాభివృద్ధికే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.