ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​కు ఉత్తర కొరియా దూరం - టోక్యో ఒలింపిక్స్

ఈ సారి టోక్యో ఒలింపిక్స్​లో తమ దేశం పాల్గొనబోదని ఉత్తర కొరియాకు చెందిన ఓ వెబ్​సైట్ వెల్లడించింది. మార్చి 25న క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సదరు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ది స్పోర్ట్స్​ ఇన్ డీపీఆర్​ కొరియా పేరుతో ఈ వెబ్​సైట్ ఉంది.

Website: North Korea won't participate in Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్​కు ఉత్తర కొరియా దూరం!
author img

By

Published : Apr 6, 2021, 9:31 AM IST

Updated : Apr 6, 2021, 12:55 PM IST

కరోనా వైరస్​ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్​లో ఉత్తర కొరియా పాల్గొనబోదంటూ ఆ దేశానికి చెందిన ఓ వెబ్​సైట్ పేర్కొంది. మార్చి 25న క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ ఒలింపిక్​ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ది స్పోర్ట్స్​ ఇన్​ డీపీఆర్ కొరియా పేరుతో ఉన్న వెబ్​సైట్​ వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొవిడ్ సంక్షోభం కారణంగానే కొరియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వెబ్​సైట్ తెలిపింది. ఇందులో తమ దేశం పేరును డెమొక్రాటిక్​ పీపుల్స్​ రిపబ్లిక్​ ఆఫ్ కొరియాగా పేర్కొంది.

ఇదీ చదవండి: కమ్మేస్తున్న కరోనా.. ఐపీఎల్​లో పెరుగుతున్న కేసులు

ఉత్తర కొరియా నిర్ణయం పట్ల తమకెలాంటి సమాచారం లేదని తెలిపింది దక్షిణ కొరియా ఒలింపిక్ కమిటీ. సదరు వెబ్​సైట్ ఆపరేటర్​ను వెంటనే నిర్ధరించలేమని పేర్కొంది.

కాగా, అప్పటివరకు ఒకరంటే ఒకరికి పడని ఈ కొరియా దేశాలు.. 2018 వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా మాటలు కలిపే ప్రయత్నాలు చేశాయి. దక్షిణ కొరియా వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్​లో 22 మంది ఉత్తర కొరియా అథ్లెట్లు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ అధికారులు, ఆర్టిస్ట్​లు, జర్నలిస్టులు మొత్తం 230 మంది ఆటగాళ్ల వెంట దక్షిణ కొరియాకు వచ్చారు. ఆ బృందంలో కిమ్ సోదరి కూడా ఉంది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య దౌత్యం ప్రారంభమైంది.

ప్రస్తుతం ఉత్తర కొరియా నిజంగానే ఒలింపిక్స్​ నుంచి తప్పుకోవాలనుకుంటే మాత్రం మళ్లీ ఇరు దేశాల మధ్య సఖ్యత చెడే అవకాశం ఉంది. అంతే కాక ఈ దఫా ఒలింపిక్స్​కు అమెరికా అధ్యక్షుడు బైడెన్​ను ఆహ్వానించనున్నట్లు జపాన్​ ప్రధాని ఇది వరకే వెల్లడించారు.

ఇదీ చదవండి: 'మద్యం లోగోను తీసేయమని అలీ అడగలేదు'

Last Updated : Apr 6, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.