ETV Bharat / sports

Tokyo Olympics: 'పతకాలు గెలవడానికే ఒలింపిక్స్​కు..'

author img

By

Published : Jun 27, 2021, 5:27 PM IST

భారత అథ్లెట్లు ఒలింపిక్స్​కు వెళ్లేది కేవలం ఆడటానికే కాదని.. కచ్చితంగా పతకాలు సాధిస్తారని కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. ఆటగాళ్ల గురించి మన్​ కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావించడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు.

kiren rijiju, union minister
కిరెన్ రిజిజు, కేంద్ర క్రీడా మంత్రి

భారత అథ్లెట్లు టోక్యో వెళ్లేది ఒలింపిక్స్ (Tokyo Olympics)​లో పాల్గొనేందుకు మాత్రమే కాదని, పతకాలు గెలిచేందుకేనని కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) స్పష్టం చేశారు. ఇప్పటికైతే భారత్​ నుంచి 110 మంది ఆటగాళ్లు ఈ మెగా ఈవెంట్​లో పాల్గొంటున్నారు. ఈ సంఖ్య 120-130కి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మన్​ కీ బాత్(Mann Ki Baat)​ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అథ్లెట్లను ప్రశంసించిన అనంతరం రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. టోక్యోలో పాల్గొంటున్న ఆటగాళ్లకు జాతి యావత్తు మద్దతుగా నిలవాలని మోదీ పేర్కొన్నారు.

"మన్​ కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని మోదీ భారత అథ్లెట్ల గురించి ప్రస్తావించడం గర్వంగా అనిపించింది. ఎందుకంటే ప్రధాని వారికి మద్దతుగా, ఉత్సాహపరిచేలా మాట్లాడారు. ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పీఎం ఉన్నందుకు క్రీడా మంత్రిగా నాకు గర్వంగా ఉంది. టోక్యో ఒలింపిక్స్​లో ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందనే ఆత్మవిశ్వాసం నాలో ఉంది. ఎందుకంటే మన దగ్గర ప్రపంచస్థాయి అథ్లెట్లు ఉన్నారు. మన ఆటగాళ్లు టోక్యోకు వెళ్లేది కేవలం ఆడటానికే కాదు. పతకాలు గెలుచుకోవడానికి"

-కిరెన్ రిజిజు, కేంద్ర క్రీడా మంత్రి

అంతకుముందు మన్ కీ బాత్​ కార్యక్రమంలో​ ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశం యావత్తు వారికి మద్దతు ప్రకటించాలని పేర్కొన్నారు. వారెంతో కాలంగా కష్టపడితే కానీ, ఒలింపిక్స్​ బెర్త్​ దక్కలేదని తెలిపారు. అది వారి వ్యక్తిగత ప్రదర్శన కిందకు రాదని.. దేశం గర్వించే అంశమని చెప్పారు. వారిపై అనవసర ఒత్తిడి పెట్టకుండా వారికి ప్రేరణ కల్పించేందుకు ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు.

సామాజిక మాధ్యమాల వేదికగా ఆటగాళ్లను అభినందించాలని దేశ ప్రజలను మోదీ కోరారు. అందుకోసం #cheer4india హాష్​ట్యాగ్​ను ఉపయోగించాలని సూచించారు. అథ్లెట్లకు సంబంధించి కొత్తగా ఏమైనా చేయాలంటే.. అది తనకు కూడా తెలియజేయాలని చెప్పారు. మనమంతా కలిసి ఒలింపిక్స్​లో పాల్గొనే ఆటగాళ్లకు ఉమ్మడిగా మద్దతు ప్రకటిద్దామని పీఎం తెలిపారు.

ఇదీ చదవండి: ఒలింపిక్స్ థీమ్ సాంగ్​ను ఆవిష్కరించిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.