ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఎంతో ఉత్కఠంగా జరుగుతున్న మ్యాచ్ సమయంలో ఆకాశంలో అటుగా వెళ్తున్న ఓ పిట్ట అతని తలపై రెట్ట వేసింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్‌కు గురయ్యారు. తీరా ఈ విషయాన్ని గ్రహించిన జ్వెరెవ్ ఒక్క క్షణం ఆగి దాన్ని తుడుచుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్‌ను కంటిన్యూ చేశాడు. ఇది చూసిన అభిమానులు ఒక్కసారి నవ్వుకున్నప్పటికీ మ్యాచ్ మధ్యలో ఇలా జరిగిందేంటి అని ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
-
A perfect shot from the Australian Open bird 💩🤣
— Eurosport (@eurosport) January 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Alexander Zverev will be hoping he gets some good luck after that 🍀#AusOpen | @AlexZverev pic.twitter.com/Bi1TDcfz1q
">A perfect shot from the Australian Open bird 💩🤣
— Eurosport (@eurosport) January 19, 2023
Alexander Zverev will be hoping he gets some good luck after that 🍀#AusOpen | @AlexZverev pic.twitter.com/Bi1TDcfz1qA perfect shot from the Australian Open bird 💩🤣
— Eurosport (@eurosport) January 19, 2023
Alexander Zverev will be hoping he gets some good luck after that 🍀#AusOpen | @AlexZverev pic.twitter.com/Bi1TDcfz1q
కాగా, తొలి సెట్‌లో 2-2 స్కోరు సమానంతో టైబ్రేక్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక ప్రపంచ 13వ ర్యాంకర్ అయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మైకెల్ మోహ్ చేతిలో జ్వెరెవ్ 6-7(1), 6-4, 6-3,6-2తో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత అదే ఆటతీరును కనబరచడంలో విఫలమయ్యాడు. వరుస సెట్లలో మోహ్ చేతిలో కంగుతిన్నాడు.