ETV Bharat / sports

'వస్తే చెన్నైకే.. లేదంటే ఎన్ని నెలలైనా ఇక్కడే' - vishwanathan anand struck in germany

అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లిన భారత చెస్​ దిగ్గజం విశ్వనాథన్​ ఆనంద్​.. జర్మనీలో ఓ చిన్న పట్టణంలో చిక్కుకుపోయాడు. లాక్​డౌన్​ కారణంగా రెండు నెలలపాటు అక్కడే ఉంటున్నాడు. వస్తే నేరుగా చెన్నైకే వస్తానని.. మరో చోట చిక్కుకోవటం ఇష్టం లేదని అన్నాడు.

vishwanathan anand
విశ్వనాథన్​ ఆనంద్​
author img

By

Published : Apr 16, 2020, 7:00 AM IST

ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్ కొనసాగుతున్న వేళ జర్మనీలో ఓ పట్టణంలో చిక్కుకుపోయాడు భారత దిగ్గజ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. అంతర్జాతీయ చెస్‌ టోర్నీల్లో పాల్గొనేందుకు ఐరోపా వెళ్లి జర్మనీలోని బాడ్‌ సోడెన్‌ అనే చిన్న పట్టణంలో రెండు నెలలుగా ఉంటున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తుంటే.. తాను ఇప్పుడిప్పుడే స్వస్థలం చెన్నైకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదని.. ఇప్పుడున్న చోటే ఇంకొన్ని నెలలు ఉండటానికి మానసికంగా సిద్ధపడిపోయానని ఆనంద్‌ తెలిపాడు.

"నేను ఇక్కడే ఇంకొంత కాలం ఉండాల్సిందే. జర్మనీలో లాక్‌డౌన్‌ ఇప్పుడిప్పుడే ఎత్తివేసేలా కనిపించడం లేదు. మళ్లీ విమాన ప్రయాణాలు మొదలైనా.. నేరుగా చెన్నై చేరుకునే అవకాశం ఉంటేనే ఇక్కడి నుంచి బయల్దేరతాను. ఎందుకంటే మధ్యలో మరో చోట చిక్కుకోవాలని అనుకోవడం లేదు. కాబట్టి అన్ని ఆంక్షలూ తొలగిపోవాలి.

నేను స్వదేశానికి బయల్దేరేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా.. చెన్నై వరకు వెళ్తానా లేదా అనిపించి వాటిని ఉపయోగించుకోలేదు. నేను ఎక్కడికి వెళ్లినా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే నేను ఇక్కడ చిక్కుకుపోయినట్లే."

- విశ్వనాథన్ ఆనంద్‌

జర్మనీలో ఉంటూనే ఆనంద్‌.. హంపి, హరికృష్ణ తదితర భారత క్రీడాకారులతో కలిసి ఆన్‌లైన్‌ టోర్నీ నిర్వహించి కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళాలు సేకరించాడు ఆనంద్​.

ఇదీ చూడండి: చెస్ క్రీడాకారుల విరాళాల సేకరణపై మోదీ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.