ETV Bharat / sports

Wrestling: రెజ్లర్​ వినేశ్​కు స్వర్ణం

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​కు సిద్ధమవుతున్న భారత స్టార్​ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ పోలెండ్​ ఓపెన్​లో సత్తాచాటింది. శుక్రవారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం ఫైనల్​లో 8-0తో బెరెజా (ఉజ్బెకిస్థాన్)పై విజయం సాధించి స్వర్ణం అందుకుంది.

Vinesh Phoga
వినేశ్
author img

By

Published : Jun 12, 2021, 7:43 AM IST

వచ్చే నెలలో ఆరంభం కానున్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్(Olympics) దిశగా తన సన్నాహకాలు సరైన మార్గంలోనే సాగుతున్నాయని భారత స్టార్ రెజ్లర్​ వినేశ్ ఫొగాట్(vinesh phogat) అదరగొట్టింది. పోలెండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నీ మహిళల 53 కేజీల విభాగంలో శుక్రవారం ఆమె స్వర్ణం సాధించింది. తుది పోరులో 8-0తో బెరెజా (ఉజ్బెకిస్థాన్)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు ఆమె 2019 ప్రపంచ ఛాంపియన్​షిప్​ కాంస్య విజేత ఎకతెరీనా పోలెష్చుక్ (రష్యా)ను ఓడించి ఫైనల్ చేరింది.

అన్షు దూరం: ఒలింపిక్స్​కు సన్నద్ధమవుతున్న యువ రెజ్లింగ్ సంచలనం అన్షు మలిక్​కు నిరాశ ఎదురైంది. జ్వరం కారణంగా ఆమె పోలెండ్ ఓపెన్​కు దూరమైంది. శుక్రవారం మహిళల 57 కేజీల విభాగంలో ఆమె పోటీపడాల్సింది. తన కొవిడ్-19 ఫలితం వచ్చేదాకా ముందు జాగ్రత్తగా ఆమె ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉంది. 19 ఏళ్ల అను తల్లిదండ్రులకు గత గత నెలలో వైరస్ సోకింది. వాళ్లు పూర్తిగా కోలుకునేంత రకూ తన తమ్ముడితో కలిసి ఆమె ఓ హోటల్లో ఉంది. ఇప్పటికే మోచేతి గాయం కారణంగా దీపక్ పునియా ఈ టోర్నీకి దూరమైంది.

ఇదీ చూడండి: Tokyo Olympics: ఈ ఐదుగురికి పతకాలు పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.