Wrestler Vinesh Phogat Record : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డులకెక్కింది. బుధవారం ఆమె బెల్‌గ్రేడ్ ఛాంపియన్‌షిప్స్‌లో 53 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. కాంస్య పతక ప్లేఆఫ్‌లో వినేశ్ 8-0తో స్వీడన్‌కు చెందిన ఎమ్మా జోనా మాల్‌గ్రెన్‌పై గెలిచింది. క్వాలిఫికేషన్‌లో బత్కుయాగ్ (మంగోలియా) చేతిలో ఓడిన వినేశ్.. పుంజుకున్న తీరు అద్భుతం. బత్కుయాగ్ ఫైనల్ చేరడంతో రెపిచేజ్ రౌండ్‌కు అర్హత సాధించిన వినేశ్ మొదట కజకిస్థాన్‌కు చెందిన ఎషిమోవాను 4-0తో ఓడించింది.
ప్రత్యర్థి లేలా గుర్బనోవా (ఉజ్బెకిస్థాన్) గాయపడడంతో తర్వాతి బౌట్లో గెలిచి కాంస్య పతక రౌండ్లో అడుగుపెట్టింది. 28 ఏళ్ల వినేశ్ 2019 ఛాంపియన్‌షిప్స్‌లోనూ కాంస్యం గెలుచుకుంది. మరో భారత రెజ్లర్ మాన్సీ అహ్లావత్ (59కేజీ) క్వార్టర్‌ఫైనల్లో 3-5తో రెసీన్ (పోలెండ్) చేతిలో పరాజయం పాలైంది. 68 కిలోల విభాగంలో నిషా దహియా గురువారం కాంస్యం కోసం పోటీపడుతుంది. బల్గేరియాకు చెందిన సోఫియాను 11-0తో ఓడించడం ద్వారా ఆమె సెమీఫైనల్ చేరుకుంది. కానీ సెమీస్‌లో ఆమె జపాన్ అమ్మాయి ఇషి చేతిలో ఓడింది. రీతిక (72 కేజీ) తొలి రౌండ్లో 2-6తో డేచర్ (ఫ్రాన్స్) చేతిలో కంగుతింది.
ఇదీ చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్
ఐపీఎల్లో జోరు.. జాతీయ జట్టులో మాత్రం బేజారు.. రాబిన్ ఉతప్ప ప్రస్థానమిది