ETV Bharat / sports

ఖేల్​రత్నకు రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పేరు​

భారత రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ పేరును ఖేల్​రత్నకు సిఫార్సు చేసింది భారత రెజ్లింగ్​ సమాఖ్య. అర్జున అవార్డులకు రాహుల్​ అవారే, దీపిక్ పునియా సహా మరో ముగ్గురు​ పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది.

Vinesh
వినేశ్​ ఫొగాట్
author img

By

Published : Jun 2, 2020, 7:29 PM IST

భారత అగ్రశ్రేణి రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​కు ​అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉంది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డు (2020)కు ఈమె పేరును సిఫార్సు చేసింది భారత రెజ్లింగ్​ సమాఖ్య. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన ఏకైన మహిళా రెజ్లర్​ వినేశ్​ కావడం గమనార్హం.

అర్జున అవార్డులకు ప్రపంచ ఛాంపియన్​షిప్​ మెడలిస్ట్​ రాహుల్​ అవారే​, దీపిక్ పునియా, సాక్షి మాలిక్​, సందీప్​ తోమర్​, నవీన్ పేర్లను కేంద్రానికి పంపింది.

రెజ్లర్​ కోచ్​లు వీరేంద్ర కుమార్​, కుల్దీప్​ సింగ్​ మాలిక్​, సుజిత్​ మాన్​, శాయ్​ కోచ్​ ఓపీ యాదవ్​లను ద్రోణాచార్య అవార్డుకు ప్రతిపాదించింది.

అలాగే ధ్యాన్​చంద్​ అవార్డు కోసం జయ్​ ప్రకాశ్​, అనిల్​ కుమార్​, దుష్యంత్ శర్మ, ముఖేశ్​ ఖత్రి పేర్లను నామినేట్​ చేసింది.

ఇది చూడండి : ఖేల్​రత్నకు భారత అగ్రశేణి బాక్సర్ల పేర్లు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.