భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ మార్చి 19న రింగ్‌లోకి దిగనున్నాడు. గోవా వేదికగా జరుగనున్న మెజెస్టిక్ కాసినో ప్రైడ్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. మెజెస్టిక్ ప్రైడ్ కాసినో షిప్ పైకప్పు మీద ఈ పోటీలు జరగనున్నాయి. ఇది వెగాస్ తరహా బాక్సింగ్ శైలి. పనాజీలోని మండోవి నదిలో ఈ బాక్సింగ్‌ను నిర్వహించనున్నారు. త్వరలోనే ప్రత్యర్థి పేరు ప్రకటిస్తామని విజేందర్ ప్రమోటర్లు స్పష్టం చేశారు.
2019లో చివరిసారిగా బాక్సింగ్ రింగ్‌లో కనిపించిన విజేందర్ సింగ్.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా 12 విజయాలు నమోదు చేశాడు. కరోనా కారణంగా ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు ఈ బాక్సర్.
ఇదీ చదవండి: వచ్చే నెలలో బాక్సింగ్ రింగ్‌లోకి విజేందర్