ఫ్రొఫెషనల్ బాక్సర్‌గా తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్నాడు భారత ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్. వరుసగా 11వ విజయాన్ని ఖాతాలో వేసుకొని ఓటమి ఎరుగని వీరుడిగా నిలిచాడు. అమెరికాలో అడుగుపెట్టి ఆరంభ బౌట్‌లోనే... ఆ దేశ స్టార్ యోధుడు మైక్ స్నైడర్‌కు గుర్తుండిపోయే ఓటమినిచ్చాడు.
-
TKO victory ✅
— Top Rank Boxing (@trboxing) July 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Still undefeated ✅
A great Top Rank debut for Vijender Singh 💪#StevensonGuevara | @ESPN+ pic.twitter.com/26pSwvAvQ5
">TKO victory ✅
— Top Rank Boxing (@trboxing) July 14, 2019
Still undefeated ✅
A great Top Rank debut for Vijender Singh 💪#StevensonGuevara | @ESPN+ pic.twitter.com/26pSwvAvQ5TKO victory ✅
— Top Rank Boxing (@trboxing) July 14, 2019
Still undefeated ✅
A great Top Rank debut for Vijender Singh 💪#StevensonGuevara | @ESPN+ pic.twitter.com/26pSwvAvQ5
38 ఏళ్ల స్నైడర్‌తో జరిగిన పోరులో నాలుగో రౌండ్ రెండో నిమిషంలో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించాడు సూపర్ మిడిల్ వెయిట్ బాక్సర్ విజేందర్. రిఫరీ విజేతగా ప్రకటించేవరకు పిడిగుద్దుల వర్షం ఆగలేదు. ఓ దశలో అగ్రరాజ్య బాక్సర్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. ఈ విధంగా 33 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్... ఎనిమిదవ సారి నాకౌట్లోనే విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
" చాలా రోజుల తర్వాత రింగ్‌లో అడుగుపెట్టి మళ్లీ నా సత్తా నిరూపించుకున్నాను. అమెరికా గడ్డపై విజయం సాధించడం చాలా గర్వంగా ఉంది. నాలుగు రౌండ్లలో ఫలితం తేలిపోయింది. నేను రెండు, మూడు రౌండ్లలో కానిచ్చేద్దాం అనుకున్నా. ఫలితం పట్ల సంతోషంగా ఉంది. నా ప్రమోటర్లు తర్వాతి మ్యాచ్‌లు ఎవరితో తలపడాలని నిర్ణయిస్తారో.. నేను వారితో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాను".
-- విజేందర్, భారత సూపర్ మిడిల్ వెయిట్ బాక్సర్
ఇప్పటివరకు స్నైడర్ 13 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు 5 అపజయాలతో ఉండేవాడు. విజేందర్ దెబ్బతో మరో ఓటమి ఖాతాలో చేరింది. విజేందర్ ఇదే ఏడాది మరో రెండు మ్యాచ్‌ల్లో తలపడనున్నాడు. ఇందులో ముఖ్యంగా 'హాల్ ఆఫ్ ఫేమర్' బాబ్ ఆరుమ్తో టాప్ ర్యాంక్ ప్రచారం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు.
విజేందర్ ఇటీవల దక్షిణ దిల్లీ ప్రాంతం నుంచి సార్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేశాడు. కానీ ప్రజల తీర్పు వ్యతిరేకంగా రావడం వల్ల ఓటమిపాలయ్యాడీ మాజీ డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ ఛాంపియన్.