US Open 2023 Winner Djokovic : యూఎస్ ఓపెన్ 2023 ఫైనల్స్‌లో సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో మెద్వెదెవ్‌తో తలపడిన జకోవిచ్.. 6-3, 7-6, 6-3 తేడాతో గెలుపొందాడు. తాజా విజయంతో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను జకోవిచ్.. తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్‌ను సమం చేశాడు. ఈ విజయంతో 36 ఏళ్ల జకోవిచ్ తిరిగి ప్రపంచ నంబర్-1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
ఆట సాగిందిలా.. 3 గంటల 17 నిమిషాల పాటు సాగిన ఆటలో ప్రారంభం నుంచే జకోవిచ్ దూకుడుగా ఆడాడు. తొలి సెట్లోనే 6-3 తో ఆధిపత్యం చలాయించాడు. ఇక రెండో సెట్లో మెద్వెదెవ్.. జకోకు దీటుగా బదులిచ్చాడు. కానీ చివర్లో మళ్లీ పట్టుకోల్పోయిన మెద్వెదెవ్ వెనకబడ్డాడు. ఈ సెట్‌ను జకో.. 7-6తో గెలిచాడు. ఇక కీలకమైన మూడో సెట్లోనూ జకోవిచ్ జోరు ప్రదర్శించి.. 6-3 తేడాతో మెద్వెదెవ్‌ను ఓడించాడు. ఓవరాల్‌గా జకోవిచ్‌కు ఇది నాలుగో యూఎస్ ఓపెన్ టైటిల్.
-
That's a lot of hardware. 🤯 pic.twitter.com/eRPA0vxNMl
— US Open Tennis (@usopen) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">That's a lot of hardware. 🤯 pic.twitter.com/eRPA0vxNMl
— US Open Tennis (@usopen) September 11, 2023That's a lot of hardware. 🤯 pic.twitter.com/eRPA0vxNMl
— US Open Tennis (@usopen) September 11, 2023
జకోవిచ్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లు..
- ఆస్ట్రేలియా ఓపెన్- 10
- వింబుల్డన్- 7
- యూఎస్ ఓపెన్- 4
- రోలాండ్ గారోస్- 3
యూఎస్ ఓపెన్ 2023లో జకోవిచ్..
- రౌండ్ 16.. గొజోతో తలపడిన జకోవిచ్.. 6-2, 7-5, 6-4 తో గెలిచాడు.
- క్వార్టర్ ఫైనల్.. క్వార్టర్స్‌లో జకోవిచ్ ఫ్రిట్డ్తో తలపడ్డాడు. ఈ గేమ్‌ను జకో.. 6-1, 6-4, 6-4 తేడాతో సొంతం చేసుకున్నాడు.
- సెమీస్.. షెల్టన్, జకోవిచ్ మధ్య జరిగిన సెమీస్ పోరులో జకోవిచ్.. 6-3, 6-2, 7-6 తో నెగ్గి ఫైనల్స్‌లోకి దూసుకెళ్లాడు.
-
Novak hoists the 🏆 once again in New York! pic.twitter.com/LmZGzxT4Tp
— US Open Tennis (@usopen) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Novak hoists the 🏆 once again in New York! pic.twitter.com/LmZGzxT4Tp
— US Open Tennis (@usopen) September 11, 2023Novak hoists the 🏆 once again in New York! pic.twitter.com/LmZGzxT4Tp
— US Open Tennis (@usopen) September 11, 2023
-
ఇంతకుముందు.. అతడు 2011, 2015, 2018లో యూఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇక ఈ ఏడాదిలో జకోవిచ్‌కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇదివరకు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. కాగా 2021 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ కూడా జకోవిచ్, మెద్వెదెవ్ మధ్యే జరిగింది. అప్పుడు జకోవిచ్‌ను మెద్వెదెవ్ 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించి.. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడాడు.
US Open 2023 Women's Doubles Final : ఇదే యూఎస్ ఓపెన్ 2023 ఉమెన్స్ డబుల్స్ ఫైనల్లో డబ్రోస్కీ-రౌత్లిఫ్ జోడీ విజయం సాధించింది. తుది పోరులో ఈ జోడీ.. 2020 ఛాంపియన్స్ సిగెమంద్-వొనారెవాపై 7-6 , 6-3 తేడాతో నెగ్గింది. అయితే డబ్రోస్కీ-రౌత్లిఫ్ జోడీకి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇక డబ్రోస్కీ కెనడా ప్లేయర్ కాగా.. రౌత్లిఫ్ న్యూజిలాండ్ దేశానికి చెందిన క్రీడాకారిణి.
వింబుల్డన్ కోటలో కొత్తరాజు.. జకోవిచ్‌పై సంచలన విజయం
యూఎస్ ఓపెన్ విజేతగా అల్కరాజ్.. నెం.1 ర్యాంకు కైవసం.. నాదల్ రికార్డు సమం