హత్య కేసులో నిందితుడైన ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను దిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్లు సమాచారం. అతడు గత 15 రోజులుగా పరారీలో ఉన్నాడు. "జలంధర్ సమీపంలో సుశీల్ అరెస్టయ్యాడు. హత్య కేసులో మరో నిందితుడైన అజయ్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు" అని పోలీసు వర్గాలు తెలిపాయి.

మే 4న ఛత్రసాల్ స్టేడియం వద్ద రెండు వర్గాల రెజ్లర్ల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్ అనే 23 ఏళ్ల రెజ్లర్ మరణించాడు. సుశీల్ కూడా అతడిపై దాడి చేశాడన్నది ఆరోపణ. అప్పటి నుంచి సుశీల్ కోసం దిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. అతడి ముందస్తు బెయిలు దరఖాస్తును కోర్టు తిరస్కరించింది.
ఇది చదవండి: పెద్ద వివాదంలో సుశీల్.. అసలేం జరిగింది?