ETV Bharat / sports

ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్​ మాస్టర్లు - అక్కాతమ్ముళ్ల ఘనత వెనుక 'తల్లి' శ్రమ! - ఆర్​ ప్రజ్ఞానంద అమ్మ నాగలక్ష్మి

Two Grand Masters In One Family R Praggnanandhaa : ఒకే ఇంట్లో ఇద్దరు గ్రాండ్​ మాస్టర్​ అక్కాతమ్ముళ్లు. ఒకరు ప్రపంచ నెంబర్​ వన్​ గ్రాండ్​మాస్టర్​​ మాగ్నస్​ కార్ల్​సన్​ను మట్టికరిపించిన తమ్ముడు ప్రజ్ఞానంద. మరొకరు తాజాగా భారతీయ మూడో మహిళా గ్రాండ్​మాస్టర్​గా అవతరించిన అక్క వైశాలి. అయితే వీరిద్దరు వెనుకు ఉండి నడిపించిన శక్తి మాత్రం అమ్మ నాగలక్ష్మి. యావత్​భారతం తలెత్తుకునేలా ఇద్దరు గ్రాండ్​ మాస్టర్లను దేశానికి అందించింది. వారి ప్రతి అడుగులో వెంటే ఉంటూ విజయ తీరాలకు నడిపించింది. నాగలక్ష్మి ఎలా ఇద్దరు గ్రాండ్​ మాస్టర్లను ఎలా తీర్చిదిద్దిందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Two Grand Masters In One Family R Praggnanandhaa

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 10:39 PM IST

Two Grand Masters In One Family R Praggnanandhaa : చెస్​- ఈ క్రీడ భారతదేశంలో పురుడుపోసుకుంది. దీని అసలు పేరు చతురంగ (చదరంగం). ప్రస్తుతం ఈ క్రీడలో భారత్​ అగ్ర శక్తిగా ఎదుగుతోంది. అయితే మేధో శక్తితో ఆడే ఆ ఆటలో తమిళనాడుకు చెందిన అక్కాతమ్ముళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారే ప్రపంచ నెంబర్ వన్​ మాగ్నస్​ కార్ల్​సన్​ను మట్టికరిపించిన తమ్ముడు రమేశ్​బాబు ప్రజ్ఞానంద. ప్రస్తుతం భారత చెస్​ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేస్తున్న క్రీడాకారుడు. కేవలం 12 ఏళ్ల 10 నెలల వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌ అయి చరిత్ర సృష్టించాడు. మరోవైపు భారత 84వ, భారతీయ మూడో మహిళా గ్రాండ్​ మాస్టర్​గా నిలిచిన అక్క రమేశ్​బాబు వైశాలి. అయితే వీరి విజయం వెనుక ఒక సాధారణ భారతీయ గృహిణి అవిశ్రాంత కష్టం ఉంది. ప్రజ్ఞానంద, వైశాలి తాము చెస్​ బోర్డుపై వేసే ప్రతి ఎత్తు వెనుక వారి తల్లి నాగలక్ష్మి అపారమైన ప్రేమ ఉంది.

కార్టూన్ల నుంచి దృష్టి మళ్లించడానికి..!
అయితే పిల్లలను చెస్​ ప్లేయర్లుగా చేద్దామనే ఆలోచన ఆ మొదటి నుంచీ తల్లికి లేదు. ప్రజ్ఞానంద, వైశాలి తండ్రి రమేశ్‌ బాబు బ్యాంకు ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. అయితే చిన్నతనంలో వైశాలి కార్టూన్లు ఎక్కువగా చూసేది. అయితే టీవీపైనే ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తోందని.. దాని నుంచి దృష్టి మళ్లించడానికి నాగలక్ష్మి చెస్‌ బోర్డు కొనిచ్చింది. దీంతో చిన్నారి వైశాలి మెల్లిగా చదరంగంపై పట్టు సాధించింది. ఐదేళ్లు రాగానే బ్లూమ్‌ చెస్‌ అకాడమీలో ఆ చిన్నారిని చేర్పించారు. అద్భుతంగా రాణించిన వైశాలి.. అండర్‌-11,13,15ల విభాగంలో దేశస్థాయిలో బంగారు పతకాలు సాధించింది. 2015లో నేషనల్‌ ఛైల్డ్‌ అవార్డును నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి అందుకొంది. అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ (ఫిడే) తాజాగా వెల్లడించిన ర్యాంకుల ప్రకారం వైశాలి 2500+ రేటింగ్‌ పాయింట్లను సాధించి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన మూడో భారతీయ మహిళగా, తొలి తమిళనాడుకు చెందిన మహిళగా నిలిచింది.

నిజానికి చెస్​లో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కించుకోవడం ఆషామాషీ విషయం కాదు. ఇంటర్నేషనల్‌ చెస్‌ ఫెడరేషన్‌ (ఫిడే) పేర్కొన్న పలు రకాల కఠిన కొలమానాల్లో ఇమడాలి. విశ్వనాథన్‌ ఆనంద్‌ వంటి దిగ్గజానికి కూడా 18 ఏళ్ల వయసులో 1988లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కిందంటే ఆ నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

అక్కను చూస్తూ.. అందనంత ఎత్తుకు ప్రజ్ఞానంద!
మరోవైపు అక్క చెస్​ ఆడటం చూసి దానిపై ప్రజ్ఞానందకు ఆసక్తి పెరిగింది. అలా ప్రజ్ఞానంద చెస్​పై పట్టు సాధించాడు. అక్కతో కలిసి ఆడుతూ ఆటపై కాస్త పట్టు సాధించాక.. త్యాగరాజన్‌ అనే కోచ్‌ దగ్గర అతడు శిక్షణకు చేరాడు. స్వీయ ప్రతిభకు శిక్షణ తోడవడం వల్ల పిన్న వయసులోనే పెద్ద వాళ్ల మీద గెలుస్తూ 10 ఏళ్ల 10 నెలలకే ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయి ప్రపంచ చెస్‌ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడయ్యాడు. ఆ తర్వాత రెండేళ్లకే జీఎమ్ అయ్యాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే మహామహులను మట్టికరిపిస్తున్నాడు.

అంతటికీ కారణం అమ్మే..!
గ్రాండ్​మాస్టర్​ కావడమే చాలా పెద్ద విషయం. అలాంటిది ఒకే ఇంట్లో ఇద్దరు గ్రాండ్​మాస్టర్లు అంటే అది అసాధ్యం. కానీ తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని వైశాలి, ప్రజ్ఞానంద నిరూపించారు. వీరిద్దరి విజయాల వెనుక వారి తల్లి నాగలక్ష్మి కష్టం దాగి ఉంది. ఏంతగా ఉంటే స్థానిక టోర్నీలైనా.. అంతర్జాతీయ స్థాయిలో తలపడ్డా సరే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు వైశాలి, ప్రజ్ఞానందకు తమ వెంట తల్లి నాగలక్ష్మి తోడు ఉండాల్సిందే. క్లాస్​లకు తీసుకెళ్లడం దగ్గర నుంచి ఇంటిని ప్రాక్టీస్ చేయడానికి అనుగుణంగా ఉండేలా చేసేంతవరకు అన్నీ ఆమె దగ్గరుండి చూసుకున్నారు. అంతే కాకుండా వారితో పాటు విదేశాలలో జరిగే టోర్నమెంట్‌లకు వెళ్తూ ఉండేవారు. అలా ఓ సమయంలో ప్రజ్ఞానందకు ఇంటి భోజనం దూరం కాకూడదని భావించిన తల్లి.. ఆమె వెంట ఇండక్షన్ స్టవ్​తో పాటు రైస్ కుక్కర్‌ని కూడా తీసుకెళ్తుంటారట. వాటిపై ప్రజ్ఞానంద కోసం రసం, సాంబార్​ లాంటివి వండిపెడుతారట.

ఆ ఘనతంతా నా భార్యదే : రమేశ్​ బాబు
వైశాలి, ప్రజ్ఞానంద తండ్రి రమేశ్​ బాబు కూడా ఈ విషయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. 'ప్రజ్ఞానంద ఎదుగుదల తాలూకు ఘనతంతా నా భార్యకే కట్టబెడతా. ఆమె చిన్నతనం నుంచి అతడికి ఎంతగానో మద్దతుగా నిలుస్తోంది. తనే అతణ్ని టోర్నీలకు తీసుకెళ్తుంటుంది. ఇద్దరు పిల్లల్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దింది. టీవీ వీక్షణం నుంచి దృష్టి మళ్లించడానికి చెస్‌ నేర్పిస్తే ఇద్దరికీ ఆ ఆట బాగా నచ్చేసింది' అని రమేశ్​ బాబు గతంలో తెలిపారు.

ఇంట్లో తెలుగు సినిమాలను చూస్తాం : నాగలక్ష్మి
ప్రజ్ఞానంద కుటుంబంలో తెలుగు మూలాలుండటం విశేషం. అతడి తండ్రి రమేశ్‌ బాబు తెలుగువారే. వీరిది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. రమేశ్‌తో పాటు ఆయన భార్య నాగలక్ష్మి కూడా తెలుగు మాట్లాడుతుంది. ఇంట్లో పెద్ద వాళ్లు తెలుగులోనే సంభాషించుకుంటారట. అయితే ప్రజ్ఞానందకు, అతడి సోదరి వైశాలికి తెలుగు అర్థమవుతుంది కానీ.. మాట్లాడలేరట. ఒక ఇంటర్వ్యూలో నాగలక్ష్మే స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తమ ఇంట్లో తెలుగు సినిమాలు కూడా చూస్తుంటామని ఆమె చెప్పింది.

  • 🇮🇳 Vaishali Rameshbabu is going to be India’s 3rd female to achieve the Grand Master (GM) title & India’s 84th GM!

    Vaishali & Praggnanandhaa will be the world's first sister-brother duo to become Grandmasters. @chessvaishali @rpragchess

    Vaishali has had an amazing year -… pic.twitter.com/1qY0DLJVyZ

    — International Chess Federation (@FIDE_chess) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

30 స్లాట్​లు 45 మంది ప్లేయర్లు - విదేశీ ఆటగాళ్లపైనే స్పెషల్ ఫోకస్ - జాక్​పాట్ కొట్టేదెవరో?

గ్రౌండ్​లో కొడుకు ఆట - మెట్లపై కూర్చుని చూసిన ద్రవిడ్​ - సింప్లిసిటీ అంటే ఇదే కదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.