కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలను సోమవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'పద్మ' అవార్డుల జాబితాను విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గాను ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మంది పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. కాగా, క్రీడా విభాగంలో ఏడుగురికి పద్మశ్రీ అవార్డు లభించింది.
అవార్డు గ్రహీతలు
పీ అనిత (తమిళనాడు), మౌమా దాస్ (పశ్చిమబెంగాల్), అన్షు జంసేన్సా (అరుణాచల్‌ప్రదేశ్), మాధవన్ నంబియార్ (కేరళ), సుధా హరినారయణ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), వీరేంద్ర సింగ్ (హరియాణా), కే.వై వెంకటేశ్ (కర్ణాటక)
ఇదీ చూడండి: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం