ఈ ఏడాది టోక్యోలో జరగబోయేది తన చివరి ఒలింపిక్స్ అని భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి దేశంలో మహిళల బాక్సింగ్‌కు ఆదరణ పెరగడంలో కీలక పాత్ర పోషించిన మేరీ.. ఈ ఏడాది జులై-ఆగస్టు నెలల్లో జరిగే ఒలింపిక్స్ తర్వాత తాను ఈ మెగా టోర్నీలో కనిపించనంది.
"అవును. టోక్యోలో జరగబోయేదే నా చివరి ఒలింపిక్స్. ఇక్కడ వయసు కీలకమవుతోంది. ప్రస్తుతం నాకు 38 ఏళ్లు. త్వరలో 39వ పడిలోకి వెళ్తున్నా. ఇంకో మూణ్నాలుగేళ్లు ఆటలో కొనసాగడం అంటే కష్టం. ప్యారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో నేను ఆడాలన్నా అనుమతించపోవచ్చు. బాక్సర్లకు వయసు పరిమితి 40 ఏళ్లే. టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడ్డాయి కాబట్టి ఆ పరిమితిని ఒక సంవత్సరం పెంచారు."
-మేరీ కోమ్, భారత బాక్సింగ్ దిగ్గజం.
ఇదీ చదవండి: పొట్టి ప్రపంచకప్ ముందు మనోళ్లు సత్తా చాటేనా?