టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లోని 80వేల మంది వాలంటీర్ల(olympics volunteers quit)లో 10వేల మంది తప్పుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాలంటీర్లగా కొనసాగేందుకు వారు నిరాకరించినట్లు తెలుస్తోంది.
"వాలంటీర్లు తప్పుకోవడానికి కారణమైతే.. నాకు తెలిసి కరోనా సోకుంతుందని భయంతో వైదొలగి ఉండొచ్చు" అని ఓ జపాన్ న్యూస్ నిర్వాహక కమిటీ సీఈఓ తోషిరో ముటో అన్నారు.
కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics Postponed) సంవత్సరం పాటు వాయిదా పడ్డాయి. టోర్నీని ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించనున్నట్లు ఐఓసీ(IOC) వెల్లడించింది. అయితే గతంలో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి(Yoshiro Mori).. మహిళలపై చేసిన వ్యాఖ్యలతో మరి కొంతమంది వాలంటీర్లు తప్పుకున్నారు.
ఇదీ చూడండి: Tokyo Olympics: ఒలింపిక్స్ ప్రారంభానికి మరో 50 రోజులే!