విశ్వ క్రీడా పండుగ ఒలింపిక్స్ ఆరంభానికి సరిగ్గా ఏడాది సమయముంది. ఈ ఆటల కుంభమేళాలో సత్తా చాటేందుకు ప్రతి దేశమూ సన్నద్ధమవుతోంది. ఆటగాళ్లు శిక్షణలో నిమగ్నమయ్యారు. మెగాటోర్నీని ఘనంగా ఆరంభించేందుకు జపాన్‌లోని టోక్యో సిద్ధమవుతోంది. అందులో భాగంగానే వాళ్లు రూపొందించిన బంగారు, వెండి, కాంస్య పతకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జులై 24న ఈ క్రీడలను అట్టహాసంగా ప్రారంభించనున్నారు.

-
The moment you have all been waiting for, your #Tokyo2020 Olympic Medals! 🥇🥈🥉
— #Tokyo2020 #1YearToGo (@Tokyo2020) July 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
RT for good luck! 100% #Sustainable #1YearToGo pic.twitter.com/DcLKtEF0DQ
">The moment you have all been waiting for, your #Tokyo2020 Olympic Medals! 🥇🥈🥉
— #Tokyo2020 #1YearToGo (@Tokyo2020) July 24, 2019
RT for good luck! 100% #Sustainable #1YearToGo pic.twitter.com/DcLKtEF0DQThe moment you have all been waiting for, your #Tokyo2020 Olympic Medals! 🥇🥈🥉
— #Tokyo2020 #1YearToGo (@Tokyo2020) July 24, 2019
RT for good luck! 100% #Sustainable #1YearToGo pic.twitter.com/DcLKtEF0DQ
జపాన్‌లో సంబరాలు...
ఒలింపిక్స్ నిర్వహించడం అంటే మాటలు కాదు. దేశమంతటా ఓ పండుగలాంటిది. అద్భుతమైన ఆ క్రీడా సంరంభాన్ని ప్రపంచమంతా వీక్షించేందుకు ఏడాది మాత్రమే సమయముంది. అందుకే జపాన్ రాజధాని టోక్యోలో సందడి ప్రారంభమైంది. ఎక్కడ చూసినా ప్లకార్డులు, తేదీని సూచిస్తూ గడియారాలు, పోస్టర్లు కనువిందు చేస్తున్నాయి.
ఖర్చెంతో తెలుసా..?
టోక్యో ఒలింపిక్స్‌ను వీలైనంత తక్కువ ఖర్చుతో నిర్వహించాలని జపాన్ భావించింది. క్రీడలకు సంబంధించి మొత్తం ఖర్చు తొలుత 6.8 బిలియన్ డాలర్లు అనుకున్నారు. కానీ అది 20 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా. అయితే ఖర్చులో ఈ ఒలింపిక్స్ ఖర్చు.. 2014 శీతాకాల ఒలింపిక్స్(50 బిలియన్ డాలర్లు), 2008 ఒలింపిక్స్(40 బిలియన్ల డాలర్లు)కంటే తక్కువే.
-
Medals made by old phones and robots closing the language barrier.
— World Economic Forum (@wef) July 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🔎 Learn more about the 2020 Tokyo Olympics: https://t.co/vbpKsBqhW1 #tokyo #olympics pic.twitter.com/jX0pPRtA2Y
">Medals made by old phones and robots closing the language barrier.
— World Economic Forum (@wef) July 20, 2019
🔎 Learn more about the 2020 Tokyo Olympics: https://t.co/vbpKsBqhW1 #tokyo #olympics pic.twitter.com/jX0pPRtA2YMedals made by old phones and robots closing the language barrier.
— World Economic Forum (@wef) July 20, 2019
🔎 Learn more about the 2020 Tokyo Olympics: https://t.co/vbpKsBqhW1 #tokyo #olympics pic.twitter.com/jX0pPRtA2Y
పాతవే ఆధునికీకరిస్తే...
ఇప్పటికే ఎనిమిది వేదికల్లో ఐదు సిద్ధమయ్యాయి. ఆరంభ వేడుకకు ప్రాతినిధ్యం వహించే 'న్యూ నేషనల్ స్టేడియం'ను 1.25 బిలియన్ల డాలర్ల ఖర్చుతో ఆధునికీకరిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానుంది. పాత మైదానాల రూపురేఖలు మార్చి దాదాపు 35 శాతం ఖర్చును తగ్గించినట్లు వెల్లడించారు నిర్వహకులు. నిర్వహణకు తక్కువ సమయమే ఉండటం వల్ల వ్యయం ఎక్కువ అవుతుందని అంచనాకు వచ్చారు.

టోక్యో ఒలింపిక్స్ వేసవిలో ప్రారంభం కానుండటం వల్ల ఆ సమయంలో చల్లగా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం సబ్వే నిర్మాణాలు చేపడుతున్నారు. ఊహించని విధంగా భూకంపాలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు.
అదే వేదికలో...
'న్యూ నేషనల్ స్టేడియం' టోక్యో ఒలింపిక్ క్రీడలకు ప్రధాన వేదికగా పనిచేస్తుంది. ఆరంభ, ముగింపు వేడుకలతో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనుంది. 1964లో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన 'జపనీస్ నేషనల్ స్టేడియాన్ని' పడగొట్టి ఈ వేదికను సిద్ధం చేస్తున్నారు. ఖర్చు ఎక్కువ అవుతుందన్న విమర్శలతో 2015లో అనుకున్న నమూనాను మార్చి నయా స్టేడియం నిర్మాణాన్ని ఆరంభించారు.

-
🎥 If you want to report about the #1YearToGo milestone, #Tokyo2020 has lots of footage available for media.
— Tristan Lavier (@trilavier) July 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Like this time-lapse showing the construction of the Olympic Village from Sept. 2016 to Mar. 2019
© Tokyo Metropolitan Government pic.twitter.com/2EjeqC6cZ8
">🎥 If you want to report about the #1YearToGo milestone, #Tokyo2020 has lots of footage available for media.
— Tristan Lavier (@trilavier) July 23, 2019
Like this time-lapse showing the construction of the Olympic Village from Sept. 2016 to Mar. 2019
© Tokyo Metropolitan Government pic.twitter.com/2EjeqC6cZ8🎥 If you want to report about the #1YearToGo milestone, #Tokyo2020 has lots of footage available for media.
— Tristan Lavier (@trilavier) July 23, 2019
Like this time-lapse showing the construction of the Olympic Village from Sept. 2016 to Mar. 2019
© Tokyo Metropolitan Government pic.twitter.com/2EjeqC6cZ8
టెక్నాలజీతో మైమరపిస్తే...
వచ్చే ఏడాది ఆగస్టు 25 నుంచి పారా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. దివ్యాంగుల కోసం నగరంలోని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 1964లో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్ కన్నా ఘనంగా నిర్వహించనున్నారు. బుల్లెట్ రైళ్లు, రకారకాల డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి బయటపడ్డాక ఎంతగా అభివృద్ధి చెందారో ప్రపంచానికి చూపించనుంది జపాన్. డ్రైవర్ రహిత కార్లు, విమానాశ్రయాల్లో సామగ్రిని తీసుకెళ్లడానికి రోబోలు వినియోగించనున్నారు. లక్షల్లో కెమెరాలు, మైక్రో ఫోన్లతో భద్రత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఆటల పోటీల్లోనూ రోబోలను వాడనున్నారు.

సరికొత్త క్రీడలు...
2020 ఒలింపిక్స్‌లో నాలుగు కొత్త ఆటలను ప్రవేశపెట్టనున్నారు. కరాటే, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, సర్ఫింగ్‌లను ఈ పోటీల్లో చేర్చారు. వీటితో పాటు గతంలో తొలగించిన బేస్‌బాల్, బాస్కెట్ బాల్/సాఫ్ట్‌బాల్‌ను తిరిగి తీసుకురానున్నారు. గతంలో 18 ఈవెంట్లు ఉండేవి. ఈ క్రీడల నుంచి రెజ్లింగ్‌ను తొలుత తప్పించారు. తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ చేర్చారు.
'ఎలక్ట్రానిక్' పతకాలు..
ప్రజలు వాడేసిన మొబైల్ ఫోన్లు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పునర్వినియోగించి పతకాలు తయారుచేస్తోంది ఒలింపిక్ క్రీడల నిర్వహణ కమిటీ. దాదాపు 5 వేల పతకాల తయారీకి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరిస్తోంది.
-
Recycling, remaking, rewarding.
— World Economic Forum (@wef) July 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🔎 Learn more about the 2020 Tokyo Olympics: https://t.co/i6qpWGFQZz pic.twitter.com/XGRwvZt72K
">Recycling, remaking, rewarding.
— World Economic Forum (@wef) July 18, 2019
🔎 Learn more about the 2020 Tokyo Olympics: https://t.co/i6qpWGFQZz pic.twitter.com/XGRwvZt72KRecycling, remaking, rewarding.
— World Economic Forum (@wef) July 18, 2019
🔎 Learn more about the 2020 Tokyo Olympics: https://t.co/i6qpWGFQZz pic.twitter.com/XGRwvZt72K
అతిథులు..
1976 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత, అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు థామస్ బాచ్ సహా జపాన్ ప్రధాని షింజో అబే ఈ వేడుకలో భాగస్వామ్యం కానున్నారు. టోక్యో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ప్రారంభోత్సవానికి జపాన్ రాజు నోర్హి ప్రత్యేక అతిథిగా రానున్నారు.
టికెట్లు అమ్మితే శిక్ష తప్పదు..
ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు జపాన్వాసుల నుంచి విపరీతమైన స్పందన రానుందని అంచనా. అందుబాటులో పెట్టే టికెట్ల కన్నా 10 రెట్లు ఎక్కువగా పోటీ ఎదురయ్యే అవకాశాలున్నట్లు వెల్లడించారు నిర్వాహకులు. విదేశాల నుంచి భారీ డిమాండ్ ఉండనుందని అంచనాలన్నాయి. అనధికారికంగా టికెట్లు అమ్మేవారిపై ప్రత్యేక చట్టం ద్వారా చర్యలు తీసుకోనుంది ఆ దేశం. టికెట్ల అమ్మకాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

వ్యతిరేకత ఎక్కువే...
ఒలింపిక్స్ నిర్వహించడంపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ మొత్తం ఈ ఆటల కోసమే కేటాయించి స్థానిక ప్రజల వసతులను విస్మరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అణు దాడిలో దెబ్బతిన్న ఫుకుషిమా రూపురేఖలు మార్చడం కన్నా ఒలింపిక్స్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2011లో భూకంపం, సునామీ, మూడు అణు బాంబుల దాడికి ఫుకుషిమా దెబ్బతిన్న విషయం తెలిసిందే.