ETV Bharat / sports

కొవిడ్​ గుప్పిట్లో ఒలింపిక్స్​- 67కు చేరిన కేసులు

టోక్యో ఒలింపిక్స్​కు(Tokyo Olympics) ముందు అథ్లెట్లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ విశ్వ క్రీడలకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. తాజాగా ఓ విదేశీ అథ్లెట్​తో పాటు మరో 8 మందికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో క్రీడలకు సంబంధించిన కేసుల సంఖ్య మొత్తం 67కు పెరిగింది.

Covid infections in olympics
టోక్యో ఒలింపిక్స్​లో కొవిడ్ కేసులు
author img

By

Published : Jul 20, 2021, 1:00 PM IST

Updated : Jul 20, 2021, 1:21 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు(Tokyo Olympics) ముందు అథ్లెట్లు కరోనా బారిన పడటం నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్స్​ జరగాల్సి ఉండగా.. తాజాగా మరో 9 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంట్లో ఓ విదేశీ అథ్లెట్​ కూడా ఉన్నాడు. దీంతో ఆటలకు సంబంధమున్న కేసుల సంఖ్య 67కు పెరిగింది. ఇందులో ఓ క్రీడాకారిణి ఒలింపిక్ క్రీడాగ్రామంలో ఉన్నట్లు తెలిసింది.

అంతకుముందు, మెక్సికోకు చెందిన ఇద్దరు బేస్​ బాల్​ ఆటగాళ్లకు కొవిడ్ సోకినట్లు తేలింది. టోక్యోకు బయలుదేరే ముందు వీరికి కరోనా పరీక్ష చేయగా వైరస్ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని మెక్సికో బేస్​ బాల్​ వర్గాలు ధ్రువీకరించాయి.

అమెరికా జిమ్నాస్ట్​ క్రీడాకారిణికి కూడా కొవిడ్ సోకింది. ఆమె పేరు వెల్లడించలేదు. చిబాలో ప్రి టోక్యో ఒలింపిక్స్​ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: Olympics: షూటర్లు అదే దూకుడు కొనసాగిస్తారా?

Last Updated : Jul 20, 2021, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.