టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ యోషిరో మోరి.. శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మోరి. అప్పటినుంచి అతడి రాజీనామా కోసం జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో పాటు ప్రజలూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మోరి తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా తన పదవికి రాజీనామా చేశారు.
83 ఏళ్ల మోరి తన నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ సభ్యుల సమావేశంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్ ఒలింపిక్స్ మంత్రి సీకో హషిమోటో ధ్రువీకరించారు.
''గురువారం ఉదయం యోషిరో మోరి నుంచి నాకొక ఫోన్ వచ్చింది. రాజీనామాపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం'' అని మంత్రి తెలిపారు.
కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడిన ఒలింపిక్స్‌ను జపాన్ వేదికగా జులై 23 నుంచి నిర్వహించనున్నారు. ఆగష్టు 8 నుంచి జరగాల్సిన పారాలింపిక్స్ అదే నెల 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది.
ఇదీ చదవండి: 'క్షమాపణలకు ఓకే.. రాజీనామాకు మాత్రం నో'
ఇదీ చదవండి: ఒలింపిక్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడిపై వేటు?