ETV Bharat / sports

వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ జరిగేది సందేహమే

వచ్చే ఏడాదిలో ఒలింపిక్స్​ జరుగుతాయని కచ్చితంగా చెప్పలేమని క్రీడల నిర్వాహక కమిటీ సీఈఓ తొషిరో ముటో చెప్పారు. ప్రస్తుతం జపాన్​లో వైరస్‌ విజృంభిస్తుండడమే ఇందుకు కారణమని అన్నారు.

Tokyo Olympics CEO Toshiro says No Guarantee That olympics held in next year
ఒలింపిక్స్​
author img

By

Published : Apr 11, 2020, 9:41 AM IST

టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందిగ్ధతకు మళ్లీ తెరలేచింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేసి.. 2021 జులై 23న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పుడూ ఒలింపిక్స్‌ జరుగుతాయని కచ్చితంగా చెప్పలేమని క్రీడల నిర్వాహక కమిటీ సీఈఓ తొషిరో ముటో అన్నారు. జపాన్‌లో వైరస్‌ విజృంభిస్తుండడమే ఇందుకు కారణం.

"వచ్చే ఏడాది జులైలో కచ్చితంగా ఒలింపిక్స్‌ ఆరంభమవుతాయి లేదా జరగవు అని చెప్పే పరిస్థితుల్లో ఎవరూ లేరు. క్రీడల నిర్వహణపై స్పష్టత ఇచ్చే స్థితిలో మేం లేం. ఏడాది పాటు ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. కనుక క్రీడలను నిర్వహించేలా వీలైనంతగా ప్రయత్నిస్తాం. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా.. క్రీడలను నిర్వహించేందుకే సర్వశక్తులా కృషి చేస్తున్నాం. టోక్యో 2020 ఒలింపిక్స్‌ను కొన్ని బీమా పాలసీల నుంచి తొలగించారు. కానీ క్రీడలు వాయిదా పడితే బీమా కిందకు వస్తుందో రాదో ఇంకా స్పష్టంగా తెలీదు. ఒలింపిక్‌ జ్యోతి యాత్ర రద్దవడం వల్ల ప్రస్తుతం అది క్రీడల నిర్వాహకుల సంరక్షణలోనే ఉంది. పరిస్థితులు మెరుగైతే జ్యోతిని ఏదో ఓ చోట ప్రదర్శించే అవకాశముంది. మానవ జాతి వచ్చే ఏడాది కరోనా సంక్షోభాన్ని అధిగమిస్తుందనే నమ్ముతున్నాం. అన్ని దేశాలూ ఒక్కతాటిపైకి వచ్చి సాంకేతికత, విజ్ఞానం సాయంతో వైరస్‌ను నిర్మూలించే చికిత్స విధానం, మందులు కనుగొనాల్సిన అవసరం ఉంది"

- తొషిరో,క్రీడల నిర్వాహక కమిటీ సీఈఓ.

వృద్ధులు అధికంగా ఉండే ఆ దేశంలో వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చూడండి : అన్నార్థుల ఆకలి తీర్చేందుకు సచిన్​ ముందడుగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.