ఒలింపిక్స్(Tokyo Olympics) కోసం వచ్చే అథ్లెట్లకు నిర్వాహకులు కండోమ్‌లు అందజేయడం మామూలే. 2016లో రియోలోనూ ఇలా జరిగింది. సురక్షిత శృంగారం పట్ల అవగాహన పెంచడానికి, అలాగే పోటీల తాలూకు ఒత్తిడి నుంచి బయట పడేందుకు అవకాశాన్ని బట్టి శృంగారంలో పాల్గొనమని ప్రోత్సహించే దిశగా ఇలా చేస్తుంటారు.
అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను నిర్వహించబోతున్న టోక్యో నిర్వాహకులు.. ఇలాంటి ఆలోచన ఏమీ చేయరనే అనుకున్నారంతా. కానీ ఈసారి కూడా అథ్లెట్లకు నిర్వాహకుల నుంచి కండోమ్(Condoms to Athletes)లు అందబోతున్నాయి.
ఒక్కో అథ్లెట్‌కు 14 చొప్పున టోక్యో ఒలింపిక్ క్రీడా గ్రామం(Olympic Village)లో మొత్తంగా 1.6 లక్షల కండోమ్(1.6 lakh condoms for olympics)లను పంచబోతున్నారట. కాకపోతే తమ నగరంలో వాటిని క్రీడాకారులు ఉపయోగించొద్దని, వాటిని జ్ఞాపికలుగా ఇంటికి తీసుకెళ్లాలని అంటున్నారు నిర్వాహకులు.
ఇదీ చూడండి.. Olympics: భారత అథ్లెట్లపై దేశవ్యాప్త కార్యక్రమాలు