ETV Bharat / sports

Amit Panghal: ప్రపంచ నెం.1 స్థానంతో ఒలింపిక్స్​కు - టోక్యో ఒలంపిక్స్​

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన భారత బాక్సర్ అమిత్ పంగాల్.. బాక్సింగ్​ తాజా ర్యాంకింగ్స్​లో తొలిస్థానంలో నిలిచాడు. మెగాక్రీడల్లో ఇతడు 52 కిలోల విభాగంలో పోటీపడనున్నాడు.

Amit Panghal
అమిత్ పంగాల్
author img

By

Published : Jun 27, 2021, 12:12 PM IST

భారత ప్రముఖ బాక్సర్​ అమిత్ పంగాల్(52 కిలోలు).. ప్రపంచ నెం.1 ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇలానే టోక్యో ఒలింపిక్స్​లో బరిలో దిగనున్నాడు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి చెందిన బాక్సింగ్ టాస్క్​ ఫోర్స్ విడుదల చేసిన తాజా ర్యాంక్సింగ్స్​లో అమిత్​ అగ్ర స్థానానికి ఎగబాకాడు. పురుషుల ర్యాంకింగ్స్​లో మనీష్ కౌశిక్(63 కిలోలు) 18వ స్థానంలో.. సతీష్ కుమార్(75, 95 కిలోలు)​ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

amith panghal
భారత బాక్సర్ అమిత్ పంగాల్

గత నెలలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో భారత బాక్సర్ అమిత్​ పంగాల్(52 కిలోలు)​.. ఉజ్బెకిస్థాన్​కు చెందిన షాఖోబిదిన్​ జోయిరోవ్​ చేతిలో 2-3 తేడాతో ఓడిపోయాడు.

ఏడోస్థానంలో మేరీ కోమ్..

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన భారత మహిళా స్టార్ బాక్సర్​ మేరీకోమ్​(69 కిలోలు).. తాజా ర్యాంకింగ్స్​లో ఏడో స్థానంలో నిలిచింది. సిమ్రాన్​జిత్ కౌర్(60 కిలోలు) నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

కొవిడ్-19 కారణంగా ఏడాది వాయిదాపడ్డ టోక్యో ఒలింపిక్స్ జులై 23న ప్రారంభమై, ఆగస్టు 8 వరకు జరగనున్నాయి.

ఇదీ చదవండి: Olympics: మహిళల విభాగంలో ట్రాన్స్​జెండర్​.. అన్యాయం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.