టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కమిటీలోని ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. అతడు.. ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 35 ఏళ్ల పురుషుడు అని నిర్వహకులు, బుధవారం వెల్లడించారు. తాను ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాడని చెప్పారు. అతడు పనిచేసిన ప్రాంతంలో క్రిమిసంహారక మందు చల్లినట్లు తెలిపారు. ఆ వ్యక్తితో కలిసి పనిచేసిన వారిని, వారి ఇళ్లలోనే ఉండాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
ఒలింపిక్ నిర్వహణ కమిటీలో 3500 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 90 శాతం మంది, గత కొన్ని రోజులు నుంచి ఇంటి నుంచే పనిచేస్తున్నారు.
అంతకు ముందు కరోనా వల్ల ఈ ఏడాదిలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే సంవత్సరం జులై 23-ఆగస్టు 8 మధ్య జరపాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి : 'అనుష్క నుంచి ఆ రెండు విషయాలు నేర్చుకున్నా'