టోక్యో ఒలింపిక్స్‌కు(TOKYO OLYMPICS) ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బల్గేరియా క్వాలిఫయర్స్‌లో భాగంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో భారత రెజ్లర్ సుమిత్ మాలిక్(SUMIT MALIK) విఫలమయ్యాడు. దీంతో రెజ్లింగ్ నుంచి తాత్కాలికంగా నిషేధం విధించారు.
ఒలింపిక్స్‌కు ముందు ఓ రెజ్లర్ డోపింగ్ టెస్టులో విఫలమవ్వడం ఇది రెండోసారి. 2016 రియో ఒలింపిక్స్(Rio olympics) సందర్భంగా నర్సింగ్ యాదవ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు అతనిపై నాలుగేళ్ల నిషేధం పడింది.
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన సుమిత్.. 125 కిలోల విభాగంలో భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మరోసారి అతని నమూనాలను పరీక్షించనున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ తెలిపింది. అందులోనూ విఫలమైతే అతనిపై నిషేధం పడనుంది. రెజ్లింగ్‌లో మొత్తం 8 మంది ప్రతిష్ఠాత్మక ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. అందులో నలుగురు పురుషులు, మరో నలుగురు మహిళలు.
ఇదీ చదవండి: Kohli Fan: 'దయచేసి నాకు కోహ్లీని ఇవ్వండి'