ETV Bharat / sports

Tokyo Olympics: ప్రారంభ వేడుకకు వేళాయెరా.. - నరుహిటో టోక్యో ఒలింపిక్స్​

క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ వేడుక మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విశ్వ క్రీడలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న జపాన్‌ ప్రభుత్వం.. భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం అతికొద్దిమంది ప్రముఖుల సమక్షంలో.. జపాన్‌ చక్రవర్తి నరహిటో విశ్వక్రీడలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

The grand opening ready for the Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభోత్సవ వేడుకకు రంగం సిద్ధం
author img

By

Published : Jul 23, 2021, 5:04 AM IST

Updated : Jul 23, 2021, 5:24 AM IST

జపాన్ రాజధాని టోక్యోలో మరికొన్ని గంటల్లో విశ్వక్రీడల ఆరంభ ఘట్టం అట్టహాసంగా ప్రారంభం కానుంది. అథ్లెటిక్స్‌, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరిగే టోక్యోలోని ఒలింపిక్స్‌ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభ వేడుకలు మొదలుకానున్నాయి. నాలుగేళ్ల ఒకసారి జరిగే ఈ అంతర్జాతీయ క్రీడలను జపాన్‌ చక్రవర్తి నరుహిటో లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాగత ప్రసంగాలు, ఆయా దేశాల జాతీయజెండాల ఎగురవేత, క్రీడాకారుల పరేడ్‌, ఆతిథ్య దేశం తమ సాంస్కృతి, సంప్రదాయాలు, ఔనత్యాన్ని చాటేలా కళాకారుల ఆటపాటలు విశ్వక్రీడల ప్రారంభ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తారు.

ఈసారి పరేడ్‌లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్యను కుదించారు. గతంలో 10 వేలకుపైగా క్రీడాకారులు ప్రారంభ వేడుకల పరేడ్‌లో పాల్గొనేవారు. ఎక్కువమంది కళాకారులతో కూడిన ప్రదర్శనలను ప్రీ-రికార్డింగ్‌ చేసి ప్రసారం చేయనున్నారు. మరికొన్ని లైవ్‌ ప్రోగ్రాంలూ నిర్వహించనున్నారు. కరోనా నిబంధనల మధ్య విశ్వ క్రీడల ఆరంభ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో మూవింగ్‌ ఫార్వర్డ్‌ థీమ్‌తో ఒలింపిక్స్‌ వేడుకలు నిర్వహిస్తుండగా.. యునైటెడ్‌ బై ఎమోషన్‌ అనే థీమ్‌తో టోక్యో-2020 ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ సంరంభం జరగనుంది.

ప్రేక్షకుల లేకుండానే..

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో ముందు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వెయ్యి మంది ప్రముఖల సమక్షంలోనే ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను జపాన్‌ చక్రవర్తి నరుహిటో ప్రారంభించనుండగా.. ఆయన సతీమణి మహారాణి మసకొ మాత్రం దూరంగా ఉండనున్నారు. నరుహిటో తండ్రి చక్రవర్తి అఖిహిటో 1998 నగనో వింటర్‌ గేమ్స్‌ను ప్రారంభించగా.. ఆయన తాత హిరోహిటో 1964 టోక్యో సమ్మర్‌ గేమ్స్‌, 1972 సప్పొరో వింటర్‌ గేమ్స్‌ ప్రారంభించారు.

భవిష్యత్​ ఒలింపిక్స్​ వేదికలు

టోక్యో ఒలింపిక్స్‌లో 206 దేశాలకు చెందిన 11 వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 33 క్రీడలకు సంబంధించి 339 ఈవెంట్లను.. 42 వేదికలపై నిర్వహించనున్నారు. గతేడాది వేసవిలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌.. కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదాపడ్డాయి. మరో నాలుగేళ్లకు 2024లో ఫ్రాన్స్‌లోని పారిస్‌ నగరం, 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌, 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ నగరాలు విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వనున్నాయి.

ఇదీ చూడండి.. Tokyo Olympics: ఈసారి పతకం 'గురి' తప్పదు!

Last Updated : Jul 23, 2021, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.