ETV Bharat / sports

అసోం డీఎస్పీగా అథ్లెట్ హిమాదాస్

author img

By

Published : Feb 26, 2021, 7:23 PM IST

భారత స్టార్​ అథ్లెట్​ హిమాదాస్​కు డీఎస్పీ బాధ్యతలు అప్పగించింది అసోం ప్రభుత్వం. ఈ నేపథ్యంలో... తన చిన్ననాటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది హిమాదాస్.

Hima Das inducted as DSP in Assam
అసోం డీఎస్పీగా అథ్లెట్ హిమాదాస్ బాధ్యతలు

స్టార్ స్ప్రింటర్ హిమాదాస్(21) శుక్రవారం అసోంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది. ఆమెతో పాటు 597 మంది ఎస్సైల నియామకం జరిగినట్లు అసోం పోలీసు శాఖ ట్విటర్​లో పేర్కొంది. ఈ నియామకంపై హిమాదాస్ హర్షం వ్యక్తం చేసింది.

"పోలీసు కావాలనేది నా చిన్ననాటి కల. మా అమ్మ కూడా నేను పోలీసు కావాలని ఆశించింది. ఇప్పుడది నెరవేరింది. అయినా... అథ్లెట్​గానే నా జీవితాన్ని కొనసాగిస్తాను."

-హిమాదాస్, భారత్ స్ప్రింటర్.

డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన హిమాదాస్​కు ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ అభినందనలు తెలిపారు. ఈ నియామకం ద్వారా క్రీడా రంగంలో రాణించాలని ఇతర యువతకు కూడా ఆసక్తి కలుగుతుందని అన్నారు.

ఇదీ చదవండి:2021 ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.