ETV Bharat / sports

'జులైలో తిరిగి వచ్చేస్తా.. అవన్నీ తప్పుడు ఆరోపణలే'

ఇంటర్నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ విధించిన నిషేధంపై.. ఇండియన్​ స్టార్​ అథ్లెట్​ దీపా కర్మాకర్​ స్పందించింది. నిషేధిత పదార్థం తన శరీరంలోకి ఎలా చేరిందో తెలియదని చెప్పింది. కాగా, జులైలో తనకిష్టమైన ఆటను మళ్లీ ప్రారంభిస్తానని తెలిపింది.

deepa karmakar
deepa karmakar
author img

By

Published : Feb 4, 2023, 8:14 PM IST

అంతర్జాతీయ టెస్టింగ్​ ఏజెన్సీ తనపై 21 నెలల నిషేధం విధించడంపై.. భారత్​ స్టార్​ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ స్పందించింది. తన కేరీర్​ కోసం తాను చేసిన సుధీర్ఘ పోరాటం ముగిసిందని తెలిపింది. జులై 2023లో మళ్లీ నాకు ఇష్టమైన ఆటను తిరిగి మొదలుపెడతా అని చెప్పింది. '2021 అక్టోబర్‌లో నా నుంచి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షించడానికి పంపారు. నేను నిషేధిత పదార్థాన్ని తీసుకున్నట్లు అందులో తేలింది. కానీ, అది ఎలా నా శరీరంలోకి చేరిందో గుర్తించలేకపోయాను. నాపై రెండేళ్లు సస్పెన్షన్ విధించినట్లు చాలా మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. అవన్నీ తప్పుడు వార్తలు. నా శిక్షా కాలాన్ని మూడు నెలలు తగ్గించారు. జూలై 2023లో తిరిగి నాకిష్టమైన ఆటను మళ్లీ మొదలుపెడతా' అని దీపా కర్మాకర్‌ వెల్లడించింది.

కాగా, దీపా కర్మాకర్‌పై ఇంటర్నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఐటీఏ) 21 నెలల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడం వల్ల ఐటీఏ చర్యలు తీసుకుంది. దీపా కర్మాకర్​పై ఈ ఏడాది జులై 10 వ‌ర‌కు నిషేధం అమ‌లులో ఉంటుంద‌ని పేర్కొంది. నిషేధిత ఉత్ప్రేర‌కం హిగ‌న‌మైన్‌ ప‌రీక్ష‌లో ఆమె పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె డోపింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు అధికారులు నిర్ధరించారు. అనంతరం 2021 అక్టోబర్ 11న దీపా కర్మాకర్ నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పుడే డోపింగ్‌ టెస్టులో దొరిగిపోయింది. కానీ, ఈ విషయాన్ని ఇప్పుడు ప్రకటించారు. శిక్షాకాలం అప్పటి నుంచి అమలుకావడం వల్ల 2023 జులై 10తో నిషేధం ముగుస్తుంది. కాగా, 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌ వాల్ట్‌లో దీపా.. నాలుగో స్థానంలో నిలించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.