ETV Bharat / sports

Thailand open: శ్రీకాంత్, సింధు శుభారంభం.. సైనా, ప్రణయ్​ ఔట్​

Thailand open 2022 Pv sindhu Srikanth: థాయ్​లాండ్​ ఓపెన్​ టోర్నీలో భారత స్టార్ షట్లరు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు శుభారంభాన్ని అందించారు. అయితే మిగతా విభగాల్లో కొంతమంది భారత ఆటగాళ్లు మాత్రం నిరాశపరిచి.. మొదటి రౌండ్​లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Thailand open 2022 pv sindhu srikanth
థాయ్​లాండ్ ఓపెన్ శ్రీకాంత్, సింధు శుభారంభం
author img

By

Published : May 18, 2022, 1:04 PM IST

Updated : May 18, 2022, 7:31 PM IST

Thailand open 2022 Pv sindhu Srikanth: ప్రతిష్టాత్మక థామస్​ కప్​ గెలుచుకున్న భారత బ్యాడ్మింటన్​ జట్టు.. మరో మెగా టోర్నీ 'థాయ్​లాండ్​ ఓపెన్'​పై దృష్టి సారించింది. ఈ క్రమంలో థాయ్​లాండ్​ ఓపెన్​లో కిదాంబి శ్రీకాంత్​, పీవీ సింధు శుభారంభాన్ని అందించారు. తొలి రౌండ్​లో ఫ్రాన్స్‌ షట్లర్‌ లెవర్డెజ్‌పై శ్రీకాంత్​ విజయం సాధించాడు. 18-21, 21-10, 21-16తో 49 నిమిషాల్లో లెవర్డెజ్‌పై పైచేయి సాధించి.. రెండో రౌండ్​కు అర్హత సాధించాడు శ్రీకాంత్. డెన్మార్క్‌ ప్లేయర్​ హాన్స్-క్రిస్టియన్​పై విజయం సాధించిన ఐర్లాండ్‌కు చెందిన నాట్ నుగుయెన్​తో రెండో రౌండ్​లో తలపడనున్నాడు శ్రీకాంత్​. ఇక భారత స్టార్​ షట్లర్​ సింధు.. యుఎస్​ఏకు చెందిన లారెన్​ లామ్​ను 21-19,19-21,21-18 తేడాతో ఓడించి రెండో రౌండ్​కు అర్హత సాధించింది.

అయితే మరో స్టార్​ ప్లేయర్ సైనాకు మాత్రం శుభారంభం దక్కలేదు. దక్షిణా కొరియా వరల్డ్​ నెం.19 కిమ్​పై(kim ga eun) 21-11,15-21,17-21 తేడాతో ఓడిపోయింది. మరో ప్లేయర్​ ​ అష్మిత కూడా థాయ్​లాండ్​ ప్లేయర్​ చేతిలో 10-21, 15-21 తేడాతో ఓడిపోయింది. ఇకహెచ్ ఎస్​ ప్రణయ్ కూడా మలేషియాకు చెందిన డారెన్​ లీతో పోరాడి​ 17-21,21-15,15-21 తేడాతో ఓడగా.. మరో క్వాలిఫయింగ్​ మ్యాచ్​లో కశ్యప్.. కెనడా ఆటగాడి చేతిలో 13-21, 18-21 తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక మిక్స్‌డ్ డబుల్స్ జోడీ సుమీత్ రెడ్డి, అశ్విని పొన్నప్ప కూడా మొదటి రౌండ్​లో ఓటమిని చవిచూశారు.

ఇదీ చదవండి: ముంబయి చివరి మ్యాచ్​లో సచిన్​ కొడుకు అర్జున్​కు ఛాన్స్​!

Last Updated : May 18, 2022, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.