ETV Bharat / sports

ఒలింపిక్స్​ అథ్లెట్లకు అప్పటి నుంచి టీకా! - క్రీడా మంత్రిత్వ శాఖ

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అథ్లెట్లకు వచ్చే నెల చివర్లో కరోనా టీకా అందే అవకాశం ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వగానే ఆ ప్రక్రియ మొదలు పెడాతామని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

Sports Ministry wants to start vaccination for Oly-bound athletes from March end
ఒలింపిక్స్​ అథ్లెట్లకు అప్పటి నుంచి టీకా!
author img

By

Published : Feb 11, 2021, 8:49 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అథ్లెట్లకు మార్చి నెలఖారు నుంచి కొవిడ్ టీకా అందే అవకాశముంది. ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. వ్యాక్సినేషన్​ ప్రక్రియలో ఒలింపిక్స్​ అథ్లెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే ఆ శాఖ.. ఆరోగ్య శాఖను అభ్యర్థించింది.

"ఒలింపిక్స్​కు అర్హత సాధించిన అథ్లెట్లు, కోచ్​లు, సిబ్బందికి టీకా పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య శాఖను కోరాం. రెండు దశల్లో ఆ ప్రక్రియ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశాం. ఆరోగ్య శాఖ అనుమతివ్వగానే అమలు చేస్తాం. మార్చి చివరి కల్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని అనుకుంటున్నాం." అని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.

జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్​ జరగనున్నాయి. అందుకు 5 నెలల సమయం కూడా లేనందున టీకా పంపిణీలో ఒలింపిక్స్​కు వెళ్లే అథ్లెట్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఆరోగ్య శాఖకు భారత ఒలింపిక్ సంఘం లేఖ రాసింది.

ఇప్పటివరకు 74 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్స్​కు అర్హత సాధించారు. 150 మంది వరకు అర్హత సాధించే అవకాశముందని తెలుస్తోంది. "టీకా పంపిణీపై ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉంది, ఒలింపిక్స్​​ అథ్లెట్లకు మొదటగా టీకా ఇవ్వడమే మా ప్రాధాన్యం అయినా.. తుది నిర్ణయం ఆరోగ్య శాఖ చేతుల్లోనే ఉంది" అని క్రీడా మంత్రి కిరణ్ రిజుజు గతంలో చెప్పారు.

ఇదీ చూడండి: 'అతను ఇంకా ఆడుతుంటే.. నేను సోఫాలోనే ఉన్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.