ETV Bharat / sports

'ఖేలో ఇండియా' పోటీల్లో దేశీయ క్రీడలకు చోటు - తంగ్​-టా సమాఖ్య

దేశీయ క్రీడలకు ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో స్థానం దొరికింది. కలరియపట్టు, గట్కా సహా నాలుగు సంప్రదాయ క్రీడలను పోటీల్లో చేర్చినట్లు భారత క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

Sports Ministry approves inclusion of four indigenous games
'ఖేలో ఇండియా-2021'లో ఆ నాలుగు దేశీయ క్రీడలు
author img

By

Published : Dec 20, 2020, 7:20 PM IST

Updated : Dec 20, 2020, 10:26 PM IST

మన దేశీయ క్రీడలకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది 'ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​'లో కలరియపట్టు సహా నాలుగు దేశీయ క్రీడలకు చోటు దొరికింది. హరియాణాలో జరగనున్న ఈ పోటీల్లో కలరియపట్టు, గట్కా, తంగ్​-టా, మల్లకంబూలకు స్థానం కల్పిస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా దేశీయ క్రీడలు భారత చారిత్రక సంపద అని పేర్కొన్నారు క్రీడా మంత్రి కిరణ్​ రిజిజు. వాటిని సంరక్షించడం, ప్రచారం చేయడం, ప్రజాదరణ కల్పించడం తమ శాఖ ప్రాధాన్యాంశమని చెప్పారు.

khelo india tweet about new games
ఖేలో ఇండియా ట్వీట్

"దేశీయ క్రీడల అథ్లెట్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి 'ఖేలో ఇండియా' కంటే ఉత్తమ వేదిక మరొకటి లేదు. యోగాసనాలతో పాటు ఖేలో ఇండియా-2021లో ఈ నాలుగు క్రీడలకు విశేషాదరణ దక్కుతుందని నేను నమ్ముతున్నాను. రానున్న సంవత్సరాల్లో మరిన్ని దేశీయ క్రీడలకు ఈ పోటీల్లో స్థానం కల్పిస్తాం"

-- కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి

ఖేలో ఇండియా పోటీల్లో కొత్తగా చోటు దక్కించుకున్న ఈ నాలుగు క్రీడలు... భారత్​లోని వివిధ ప్రాంతాలకు చెందినవి. కలరియపట్టు కేరళకు చెందిన ప్రాచీన క్రీడ.. దేశంలోని పలు ప్రాంతాల్లోని దీన్ని సాధన చేసేవారు ఉన్నారు. బాలీవుడ్​ నటుడు విద్యుత్​ జమ్వాల్​​ ఈ క్రీడలో సిద్ధహస్తుడు. ముల్లకంబూ క్రీడకు మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర ప్రసిద్ధి. పంజాబ్​కు చెందిన సాంప్రదాయ యుద్ధవిద్య గట్కా.. మణిపుర్​కు చెందిన​ మార్షల్​ ఆర్ట్ తంగ్​-టా.

తమ క్రీడలకు 'ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​'లో చోటు కల్పిచడం పట్ల జాతీయ గట్కా అసోసియేషన్​, తంగ్​-టా సమాఖ్య హర్షం వ్యక్తం చేశాయి. ఈ పోటీల వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ఆటలకు గుర్తింపు దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చూడండి:డీడీసీఏ​ కోచ్​గా కోహ్లీ చిన్ననాటి శిక్షకుడు

Last Updated : Dec 20, 2020, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.