దేశంలోని క్రీడాకారులకు జీవితకాలం పెన్షన్ అందిస్తామని క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. క్రీడాకారుల మెరిటోరియస్ పెన్షన్ పథకంలో భాగంగా ప్రస్తుతం 627 మంది అథ్లెట్లు లబ్ధి పొందుతున్నారన్నారు. భారత్ తరపున అంతర్జాతీయ, జాతీయ వేదికల్లో పతకాలు సాధించిన వారు.. ఈ పథకానికి అర్హులు అని చెప్పారు. అథ్లెట్ల రిటైర్మెంట్ తర్వాతైనా, 30 ఏళ్ల దాటిన తర్వాతైనా పెన్షన్ అందిచనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్, ప్రపంచకప్, ప్రపంచ ఛాంపియన్షిప్.. ఇలాంటి వేదికల్లో పతకాలు నెగ్గిన వారికి ప్రతినెలా రూ.12 నుంచి 20 వేల వరకు పెన్షన్ అందుతుందన్నారు కిరణ్ రిజిజు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న మాజీ క్రీడాకారులకు సాయం చేసేందుకు, కేంద్రప్రభుత్వం ఎప్పుడు ముందుటుందని చెప్పారు.
ఇదీ చూడండి.. అప్పుడు మోసగాడిగా... ఇప్పుడు హీరోగా