కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు కేటాయించిన మొత్తాన్ని అవసరమైతే సవరిస్తామని క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారుల అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. సోమవారం నాటి బడ్జెట్‌లో ప్రభుత్వం క్రీడలకు రూ.2596.14 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోల్చుకుంటే రూ.230.78 కోట్లు కోత విధించింది.
"అవసరమైతే కేటాయించిన మొత్తాన్ని సవరించేందుకు నిబంధన ఉంది. క్రీడాకారులు, జాతీయ క్రీడా సమాఖ్యల బాగోగులు చూసుకోడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఉంది. క్రీడాకారులకు కావాల్సిన నిధుల్లో కొరత లేదు. విదేశీ శిక్షణ, విదేశీ కోచ్‌ల నియామకంతో సహా అన్ని అవసరాల్ని తీరుస్తున్నాం" అని రిజిజు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'బుమ్రాను ఎదుర్కొన్నప్పుడు ఆ అనుభూతి కలిగింది'