మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ షెడ్యూల్ను ప్రకటించారు కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు. ఒడిశా వేదికగా ఫిబ్రవరి 22నుంచి ఈ పోటీలు ప్రారంభంకానున్నాయని చెప్పారు. మార్చి 1 వరకు ఈ ఆటలు జరగనున్నాయని అన్నారు. 17 విభిన్నమైన క్రీడల్లో ఈ టోర్నీ నిర్వహించనున్నారు.
"మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సీటీ గేమ్స్-2020 షెడ్యూల్ను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఒడిషా భువనేశ్వర్ వేదికగా ఈ క్రీడలు ప్రారంభమవుతాయి." -ఖేలో ఇండియా ట్వీట్.
ఒడిషా భువనేశ్వర్లో కిరణ్ రిజిజు ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ధర్మేంద్ర ప్రదాన్ ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్-2020 లోగోను ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: 'మ్యాచ్ రద్దుకు ముందే ఆటగాళ్లు వెళ్లిపోయారు'