దక్షిణాసియా క్రీడల్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. నేపాల్లోని ఖాట్మాండు వేదికగా జరిగిన రెండో రోజు పోటీల్లో... భారత అథ్లెట్లు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు.
స్వర్ణంతో సత్తా...
పురుషుల విభాగంలో జరిగిన 1500 మీటర్ల పరుగు పందేంలో భారత అథ్లెట్ అజయ్ కుమార్ సారో స్వర్ణం సాధించాడు. పరుగును 3.54.18 సెకన్లలో పూర్తి చేశాడు. మరో భారత్ అథ్లెట్ అజీత్ కుమార్ 3.57.18 సెకన్లతో రజతం గెలిచాడు. ఇందులో నేపాల్ అథ్లెట్ టంకా కార్కి (3.50.20 సెకన్లు) కాంస్యం అందుకున్నాడు.
మహిళలు రెండు...
మహిళల 1500 మీటర్ల పరుగులో భారత క్రీడాకారిణి చందా (4.34.51 సెకన్లు) రజతం, మరో అథ్లెట్ చిత్రా పలకీజ్ (4.35.46 సెకన్లు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. శ్రీలంక అమ్మాయి ఉడా కుబురలగె (4.34.34 సెకన్లు) పసిడి అందుకుంది.
ప్రస్తుతం భారత్ 21 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 6 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. క్రీడలకు ఆతిథ్యమిస్తున్న నేపాల్ 28 పతకాలో అగ్రస్థానంలో ఉంది. ఈ పోటీలు డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరగనున్నాయి.