ETV Bharat / sports

బంగారు పతకాల 'లిఫ్టర్లు'.. 'ది గోల్డెన్‌ ట్రియో' ఫొటో​ వైరల్​ - మీరాబాయి చాను

Common Wealth Games 2022: కామన్వెల్త్​ గేమ్స్​లో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు 18 పతకాలను అందించారు. ఈ నేపథ్యంలో వెయిట్​ లిఫ్టింగ్​లో బంగారు పతకాలు సాధించిన భారత స్టార్ లిఫ్టర్లు.. తమ సోషల్​ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్​గా మారాయి. మీరూ ఓ సారి వాటిని చూసేయండి.

weight lifting pic viral
weight lifting pic viral
author img

By

Published : Aug 4, 2022, 2:07 PM IST

Common Wealth Games 2022: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు 18 పతకాలను సాధించారు. వీటిల్లో ఐదు స్వర్ణ, ఆరు రజత, ఏడు కాంస్య పతకాలున్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్‌ ఏడో స్థానంలో నిలిచింది. నేడు పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్‌లో మహమ్మద్ అనీస్, శ్రీశంకర్‌ పతకం కోసం బరిలోకి దిగుతున్నారు. బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో పతకాల పంట పండుతోంది. ఈ క్రమంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు సాధించిన లిఫ్టర్లు తమ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

మీరాబాయి చాను, జెరెమీ లాల్రినుంగా, ఆచింత సూయిలీ వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో మీరాబాయి చాను తన సోషల్‌ మీడియా ట్విట్టర్​లో ముగ్గురు కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. 'ది గోల్డెన్‌ ట్రియో' అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున స్పందించారు.

ఇవీ చదవండి: commonwealth games 2022: జూడోలో రజతం.. వెయిట్​ లిఫ్టింగ్​, హైజంప్​లో కాంస్యాలు

womens cricket: సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా.. బార్బడోస్​పై భారీ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.