Swiss Open: రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన పీవీ సింధు.. స్విస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. డెన్మార్క్ క్రీడాకారిణి హొజ్మార్క్పై 21-14, 21-12 తేడాతో విజయం సాధించింది. సింధు తన తర్వాతి మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి నెస్లిహాన్తో తలపడనుంది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ క్రీడాకారిణి యాలీ హోయాక్స్ను వరుస సెట్లలో (21-8, 21-13) ఓడించింది.
మహిళల డబుల్స్ తొలి రౌండ్లో భారత జోడి అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జంట విజయం సాధించింది. స్విట్జర్లాండ్ జంట అలెన్ ముల్లర్, జెంజిరా స్టాడెల్మన్ను వరుస సెట్లలో ఓడించింది. పురుషుల డబుల్స్‌లో అర్జున్, ధ్రువ్ కపిల జోడీ ఓటమి పాలైంది. వారిపై ఇండోనేషియా ద్వయం ఫజర్ అల్ఫైన్, మహ్మద్ రియాన్ 19-21,13-21 తేడాతో విజయం సాధించింది.
ఇదీ చదవండి: శ్రీకాంత్ శుభారంభం.. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్‌కు సాత్విక్ జోడీ షాక్